ప్రపంచాన్ని గజ గజలాడిస్తున్న మహ్మారి కరోనా.. ఇప్పటికీ చైనాలో ఈ కరోనా భారిన పడి మూడు వేల మందికి పైగా చనిపోయారు.  80 వేల మందికి పైగా ఈ వైరస్ సోకినట్టు సమాచారం.  చైనాలోని పుహాన్ నుంచి ఈ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ప్రబలిపోతుంది.  ప్రస్తుతం భారత్ లో కూడా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.  సోషల్ మీడియాలో కరోనా గురించి వస్తున్నవార్తలు వింటుంటే జనాలు భయంతో వణికి పోతున్నారు.  ఇలాంటి సమయంలో ధైర్యంగా ఉండాలని.. కరోనాను ఎదుర్కొవాలని నాయకుల నుంచి సెలబ్రెటీల వరకు తమకు తోచిన సందేశాలు ఇస్తున్నారు.  అయితే అందరిదీ ఒక దారి అయితే.. తనది మాత్రం మరో దారి అనే సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈసారి కరోనాపై తన వెరైటీ ట్వీట్ చేశాడు. ఇక్క కూడా ఆయన తన వెరైటీ చూపించారు. 

 

 'డియర్ కరోనా వైరస్... మూగదానిలా అందరినీ చంపుకుంటూ వెళ్లేబదులు ఒక విషయం గురించి తెలుసుకో. నీవు ఒక పరాన్నజీవివి. మాతోపాటే నీవు కూడా చస్తావ్. నీవు నా మాటలను నమ్మకపోతే... వైరాలజీలో ఒక క్రాష్ కోర్సు తీసుకో. నీకు నా విన్నపం ఏమిటంటే... బతుకు, బతికించు. నీకు జ్ఞానం కలుగుతుందని ఆశిస్తున్నా' అంటూ ట్వీట్ చేశారు. అయితే కరోనా గురించి ఇప్పటికే దేశ వ్యాప్తంగా గుండెలు జారిపోయే వార్తలు వినిపిస్తుంటే రాంగోపాల్ వర్మ మాత్రం తనదైన స్టైల్లో కరోనాపై స్పందించడంపై ఓ నెటిజన్ కౌంటర్ వేశాడు.  

 

'కరోనా వైరస్ కు ట్విట్టర్ అకౌంట్ లేదు. నీవు చైనా వెళ్లి, ఆ వైరస్ ను ఎక్కించుకో. అప్పుడు అది నీ మాట వింటుంది' అంటూ రీట్వీట్ చేశాడు. ప్రస్తుతం వర్మ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఏది ఏమైనా ఎక్కడైనా నీ మార్క్ మాత్రం వదిలి పెట్టవు అంటూ మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: