తెలుగు ఇండస్ట్రీలో బ్రహ్మాజీ గురించి తెలియని వారు ఉండరు.  కెరీర్ బిగినింగ్ లోచిన్న పాత్రల్లో నటించిన బ్రహ్మాజీ ఒకనొక సమయంలో హీరోగా నటించి మెప్పించాడు.  జేడీ చక్రవర్తి, రవితేజ, బ్రహ్మాజీ వీరంత ఒక బ్యాచ్.. ఆ సమయంలో బ్రహ్మాజీ నటించిన చిత్రాలు వరుసగా రిలజ్ అవుతూ మంచి క్రేజ్ సంపాదించాడు.  కృష్ణ వంశి దర్శకత్వంలో వచ్చిన సింధూరం చిత్రంలో బ్రహ్మాజీ హీరో పాత్రలో కనిపించాడు. ఇందులో రవతేజ సెకండ్ హీరో పాత్రలో కనిపించాడు.  అలాంటి బ్రహ్మాజీ తర్వాత క్యారెక్టర్ పాత్రలకే పరిమతం అయ్యారు.  ఈ మద్య కాలంలో ఆయన ఎక్కువగా కామెడీ పాత్రల్లో నటిస్తున్నారు.  బ్రహ్మాజీ ఇప్పటి వరకు సీనియర్ నటులుతో ఎలా నటించారు.. తన జూనియర్ నటులతో కూడా అంతే ఫ్రెండ్లీగా నటిస్తున్నారు. 

 

దాంతో అతనంటే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కిరీ అభిమానం ఏర్పడింది.  ఇప్పటి వరకు చిన్న, పెద్ద చిత్రాల్లో నటించిన బ్రహ్మాజీ తనయుడు సంజయ్ ‘పిట్టకథ’ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతో మంది హీరోలు, దర్శకుడు, నిర్మాతల తనయులు హీరోలుగా పరిచయం అయ్యారు.  తాజాగా బ్రహ్మాజీ తనయుడు ‘పిట్టకథ’ తో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెడుతున్నారు.  ఈ సందర్భంగా బ్రహ్మాజీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన తనయుడుని హీరోగానే పరిచయం చేయాలని అనుకున్నాం.

 

 'ఓ పిట్టకథ' చిత్రం ఈ నెల 6న రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రంలో మా అబ్బాయి ఓ ముఖ్య పాత్రలో కనిపిస్తాడు.  అయితే తను హీరోగా ఎంట్రీ ఇస్తానని చెప్పినప్పుడు, 'ట్రై చేయి .. వర్కౌట్ అయితే వుండు .. లేదంటే మరేదైనా పని చూసుకో' అని ఒకేఒక మాట చెప్పాను.  ఎందుకంటే ఇండస్ట్రీలో రాణించడం అంటే కేవలం బ్యాగ్ గ్రౌండ్ మాత్రమే ఉంటే సరిపోదు.. నటనతో మెప్పించాలి.. సరైన కథలు రావాలి.. అందుకే మొదట చిన్న పాత్రల్లో కనిపించాలని చెప్పారు. ఒక తండ్రిగా తనని ఎంతవరకూ సపోర్ట్ చేయాలో అంతవరకూ సపోర్ట్ చేశానని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: