యువ నటుడు రాజ్ తరుణ్ ఇటీవల వరుసగా ఒకింత అపజయాలతో ముందుకు సాగుతున్నారు. ముందుగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కిన ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాజ్ తరుణ్, ఫస్ట్ మూవీతో మంచి సక్సెస్ అందుకుని ఆడియన్స్ నుండి బాగానే పేరు గడించాడు. ఇక ఆ తరువాత ఆయన నటించిన సినిమా చూపిస్తమామ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుని రాజ్ తరుణ్ కి మరింత పేరు తెచ్చిపెట్టింది. ఆపై వచ్చిన కుమారి 21 ఎఫ్ సినిమా కూడా సక్సెస్ అయింది. ఆ తరువాత మంచు విష్ణు తో కలిసి రాజ్ తరుణ్ నటించిన కామెడీ ఎంటర్టైనర్ ఈడో రకం ఆడో రకం కూడా హిట్ కొట్టి ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే అక్కడి నుండి వరుసగా రాజ్ తరుణ్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. 

 

ఇక ప్రస్తుతం విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధామోహన్ నిర్మాతగా నిర్మితం అవుతున్న ఒరేయ్ బుజ్జిగా సినిమాలో హీరోగా నటిస్తున్న రాజ్ తరుణ్, దానిపై ఎన్నో నమ్మకాలు పెట్టుకున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ తో పాటు విడుదలైన ఒక సాంగ్ కు కూడా ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించడం జరిగింది. నేడు ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ ని రిలీజ్ చేసారు సినిమా యూనిట్ సభ్యులు. మాస్, కమర్షియల్ చిత్రాల దర్శకుడు హరీష్ శంకర్ రిలీజ్ చేసిన ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం ఎంతో ఫన్నీ గా ఎంటర్టైన్మెంట్ తో పాటు పలు ఎమోషనల్ సీన్స్ తో సాగింది. వాణి విశ్వనాధ్, పోసాని కృష్ణ మురళి, రాజారవీంద్ర, సప్తగిరి, సత్య లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్లుగా నివేత పేతురాజ్, అమృత అయ్యర్, మాళవిక నాయర్ నటిస్తున్నారు. 

 

అమ్మాయిలు ఫేస్ బుక్ లో రిక్వెస్ట్ పెడితే చూస్తారు కానీ, దానిని యాక్సెప్ట్ చేయడానికి మాత్రం తెగ చేతులు పిసుక్కుంటారు అంటూ రాజ్ తరుణ్ పలికిన డైలాగ్ తో పాటు, పోసాని కృష్ణ మురళి తిప్పరా మీసం అంటూ ఫన్నీ గా పలికే డైలాగ్స్ ట్రైలర్ లో ఆకట్టుకున్నాయి. మంచి ఎంటర్టైన్మెంట్ జోడించి పలు ఎమోషనల్ సన్నివేశాల కలయికగా ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఇక ట్రైలర్ ని బట్టి చూస్తుంటే దీనితో రాజ్ తరుణ్ హిట్ కొడతారని కొందరు ప్రేక్షకుల అంటున్నారు. గతంలో వచ్చిన గుండె జారి గల్లంతయ్యిందే, ఒక లైలా కోసం సినిమాలకు దర్శకత్వం వహించిన విజయ్ కుమార్ కొండా ఈ సినిమాకు దర్శకడు కావడంతో సినిమాపై ప్రేక్షకుల్లో కొంత వరకు నమ్మకాలు ఉన్నాయి. మరి ఉగాది రోజున రిలీజ్ కానున్న ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ సాధిస్తుందో చూడాలి....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: