ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న డేంజరస్ కరోనా వైరస్ పై అన్ని దేశాలు కూడా హై ఎలర్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. చైనా దేశం నుండి వ్యాప్తి చెందిన ఈ వైరస్, అక్కడి నుండి ఇటీవల మన దేశానికి వచ్చిన అక్కడక్కడా కొందరు వ్యక్తులకు కూడా సోకినట్లు కొద్దిరోజుల క్రితం వార్తలు వచ్చాయి. అయితే దీనితో కొంత ఎలర్ట్ అయిన మన దేశ ప్రభుత్వం కూడా ప్రజలను ఎప్పటికప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవలసింది గా సూచనలు చేస్తోంది. వెల్లుల్లి వంటి ఇంట్లో దొరికే పదార్ధాలు తీసుకోవడం వలన ఈ అంటు వ్యాధికి దూరంగా ఉండవచ్చని ఇప్పటికే కొందరు డాక్టర్లు సూచిస్తున్నారు. 

 

ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవడం తో పాటు, ఎక్కువగా జనసందోహం ఉన్న ప్రదేశాల్లో తిరగవద్దని, అలానే వాడిన టిష్యుల వంటి వాటిని వెంటనే పారవేయాలని సూచిస్తున్నారు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఎవరిలో అయినా పదే పదే దగ్గు, జలుబు, గొంతు నొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే డాక్టర్ ని వేంటనే సంప్రదించాలని పలువురు సూచిస్తున్నారు. ఇకపోతే నేడు ఈ భయంకర మహమ్మారి పట్ల ప్రజలు ఎంతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. 

 

తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా ఎప్పుడూ సేఫ్ గా ఉండండి, అలానే శుభ్రతను పాటించండి అంటూ కరోనా సోకకుండా తీసుకోవాలసిన జాగ్రత్తలను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రజలకు తెలిపారు మహేష్ బాబు. కాగా ఎప్పుడూ ఇటువంటి ప్రజల శ్రేయస్సు కోరి చేపట్టే కార్యక్రమాల్లో ముందుండే మహేష్ బాబు, ఈ విధంగా కరోనా విషయమై స్పందించి ప్రజలకు తనవంతుగా జాగ్రత్తలు సూచించడం మంచి పరిణామం అని అంటున్నారు విశ్లేషకులు. కాగా మహేష్ చేసిన ఆ ట్వీట్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: