రెజీనా కసాండ్రా చిత్ర సీమ విచిత్ర విన్యాసానికి బలి అయిన టాలెంటెడ్ ఆర్టిస్ట్. ఆమె సత్తాకు తగిన క్యారక్టర్లు పడలేదు కానీ లేకపోతే  ఆమె ఏనాడో స్టార్ హీరోయిన్ అయ్యేదన్నది అందరి బలమైన అభిప్రాయం. రెజీనాకు అందమే కాదు అద్భుతమైన ప్రతిభ ఉంది. ఇక తెర విందు చేస్తే సోయగాల విషయంలో ఎక్కడా రాజీ పడని నైజం ఉంది

 

అన్నీ ఉన్నా లక్కు మాత్రం ఆమె గడప తొక్కలేదు. దాంతో టాలీవుడ్లో వెనక వచ్చిన వారు మిల మిల తారల్లా మెరిసిపోతే రెజీనా మాత్రం మిడిల్ రేంజి హీరోలతోనే సరిపెట్టుకుంది. అయితే ఆమె తన టాలెంట్ విషయంలో ఎపుడూ గట్టి పోటీ ఇస్తూనే ఉంది.

 

సరైన రోల్ వస్తే చాలెంజిగా తీసుకుని తానేంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తూనే ఉంది. ఇపుడు అలాంటి పాత్ర ఒకటి  రెజీనాకు పడింది. దాంతో దాన్ని పండించేసిందని టాక్. ఆ పాత్ర తమిళ్, తెలుగు ద్విభాషా చిత్రంగా ఉంది. తమిళంలో శూర్పనఖ మూవీ అయితే అదే తెలుగులో నేనేనా అన్న పేరుతో రిలీజ్ అవుతోంది.

 

ఓ విధంగా హారర్ మూవీలా ఉంది రెజీనా ఫస్ట్ లుక్ చూస్తే. ఈ మూవీలో పట్టుచీరతో మెరిసిపోతూనే తనలోని రౌద్ర రసాన్ని కళ్ళలో చూపిస్తూ ఫస్ట్ లుక్ వదిలారు. దానికి మంచి రెస్పాన్స్ వస్తోందట. ఈ మూవీ మీదనే రెజీనా భారీ ఆశలు పెట్టుకుంది.

 

గత ఏడాది సందీప్ కిషన్ తో నిను వీడని నీడను నేనే మూవీ చేసిన తరువాత రెజీనా నుంచి వస్తున్న మూవీ ఇదే. ఈ మూవీ లుక్ చూస్తే చంద్రముఖి టైప్ క్యారక్టర్ కోసం రెజీనా గట్టిగా శ్రమించిందనిపిస్తోంది. ఈ మూవీతోనైనా రెజీనా దశ తిరిగితే మంచి టాలెంటెడ్ ఆర్టిస్ట్ సినీ సీమకు ఉన్నట్లే లెక్క. నిను వీడ‌ని నీడ‌ని నేనే అనే థ్రిల్ల‌ర్ మూవీతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయిన కార్తీక్ రాజు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: