ప‌వ‌న్ క‌ల్యాణ్ నటిస్తున్న తాజా సినిమా 'వకీల్ సాబ్'. రీసెంట్ గా ఈ సినిమా టైటిల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాని టాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నందుకు కొందరు కామెంట్స్ విసురుతున్నారు. రాజ‌కీయాల్లో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్ రెండేళ్ళ గ్యాప్ తర్వాత మళ్ళీ సినిమాలకి ఒకే చెప్పి రెడీ అవుతున్న పింక్ రీమేక్ 'వకీల్ సాబ్'. అయితే ప‌వ‌న్ రీ ఎంట్రీ సినిమా విషయంలో బాలీవుడ్ జనాలు కామెంట్స్ చేసే అవకాశం ఉండేది కాదు. కానీ అమితాబ్ బచ్చన్ నటించిన హిట్ సినిమా పింక్ రీమేక్ వకీల్ సాబ్ కావడంతో ఈ సినిమాపై బాలీవుడ్ జ‌నాలు కాస్త ఆస‌క్తి చూపిస్తున్నారు. పింక్ రీమేక్ కి బాలీవుడ్ ప్ర‌ముఖ ప్రొడ్యూస‌ర్ బోనీ క‌పూర్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఇలా అమితాబ్ ని పవన్ కల్యాణ్ తో కంపేర్ చేస్తున్నారు. 

 

వకీల్ సాబ్ పోస్టర్ చూసి ఇందులో ముఖ్య పాత్ర‌లు చేస్తున్న వారెక్క‌డ‌? అనే సందేహాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. అందుకు కారణం బలమైనదే ఉంది. పింక్ సినిమా అంటే  బాలీవుడ్ జ‌నాల దృష్టిలో.. ఆ సినిమాలో న‌టించిన అమ్మాయిలే గుర్తొస్తారు. పింక్ సినిమాలో బిగ్ బి అమితాబ్ పోషించింది చాలా చిన్న పాత్రే. అందుకే పింక్ సినిమాను అమ్మాయిలు లీడ్ చేసిన సినిమాగానే బాలీవుడ్ లో అందరూ భావిస్తున్నారు! అయితే ప‌వ‌న్ ది పేరుకు పింక్ కు రీమేకే అయినా... ఇక్క‌డ ఆయన ఇమేజ్ కి తగ్గట్టుగా కథనం మార్చేసి ఉంటార‌ని బాలీవుడ్ జనాలు అపోహ పడుతున్నారు.

 

పింక్ అనే టైటిల్ నే వ‌కీల్ సాబ్ అంటూ మార్చేశారంటే.. ఈ సినిమా కథ స్క్రీన్ ప్లే లో ఎన్ని మార్పులు చేశారో అన్న భావనలో ఉన్నారు చాలామంది. ప‌వ‌న్ రీ ఎంట్రీకి త‌గ్గ‌ట్టుగా పింక్ క‌థ‌ను కాస్త మాస్ ఎలిమెంట్స్ తో మార్పులు చేర్పులు చేశారని ఊహించుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఫ‌స్ట్ లుక్ ను చూసి బాలీవుడ్ జ‌నాల‌కు చిన్న షాక్ తగిలింది. వాళ్ళు అనుకున్నట్టుగా అమ్మాయిలను హైలెట్ చేయకుండా పవన్ కల్యాణ్ ని హైలెట్ చేయడంతో ఇలాంటి సందేహాలన్ని చోటు చేసుకుంటున్నాయి. అయితే అసలు వకీల్ సాబ్ ని ఎలా తెరకెక్కించారో సినిమా రిలీజయ్యాక గాని అందరికీ అర్థమవదు. అప్పటి వరకు ఎవరీ ఊహలకి అడ్డుకట్ట వేయలేము.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: