సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబినేషన్లకు మంచి క్రేజ్ ఉంటుంది. ఆ సినిమా అనౌన్స్ చేయగానే అభిమానుల్లో అంచనాలు.. ట్రేడ్ సర్కిల్స్ లో బిజినెస్ లెక్కలు మొదలైపోతాయి. నందమూరి నటసింహం బాలకృష్ణ కెరీర్లో కూడా పలువురు దర్శకులు ఆయనకు బాగా కలిసొచ్చారు. బాలయ్య జనరేషన్ నుంచి తీసుకుంటే కోడి రామకృష్ణ, బి గోపాల్, బోయపాటి శ్రీను.. వంటి వారు ఉన్నారు. వీరితో సినిమా చేయడం నాకు సౌలభ్యంగా ఉంటుందని కూడా బాలయ్య పలు ఇంటర్వ్యూల్లో చెప్పాడు కూడా. ప్రస్తుతం బాలయ్య తన ఫేవరెట్ డైరక్టర్ తో ఓ సినిమా చేయనున్నాడనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

 

 

బాలకృష్ణ – బి.గోపాల్ కాంబినేషన్ మంచి హిట్ సినిమాలు ఉన్నాయి. లారీ డ్రైవర్, రౌడీ ఇన్ స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి. వీరి కాంబోలో వచ్చిన పల్నాటి బ్రహ్మనాయుడు మాత్రం డిజాస్టర్ అయింది. ప్రస్తుతం బి.గోపాల్ తాను రాసుకున్న కథను బాలయ్యకు చెప్పినట్టు సమాచారం. అసలే కలిసొచ్చిన డైరక్టర్ కావడంతో కథ విన్న బాలయ్యకు కాన్సెప్ట్ నచ్చిందని సమాచారం. అయితే పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేయమని కూడా గోపాల్ కు బాలయ్య చెప్పాడని అంటున్నారు. బాలయ్య – గోపాల్ కాంబినేషన్ అంటే నందమూరి అభిమానులకు పండగ లాంటి న్యూస్ అనే చెప్పాలి.

 

 

వీరి కాంబోలో వచ్చిన ఐదు సినిమాల్లో లారీ డ్రైవర్, రౌడీ ఇన్ స్పెక్టర్ బ్లాక్ బస్టర్లు కాగా.. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు ఇండస్ట్రీ హిట్లు అయ్యాయి. ఇంతటి సక్సెస్ గ్రాఫ్ వీరి సొంతం. బాలయ్యకు కథ నచ్చితే వెనుదిరిగి చూడడు. దర్శకుడిని మాత్రమే నమ్మి వర్క్ చేస్తాడని పేరు కూడా ఉంది. ప్రస్తుతానికి ఈ వార్తపై అఫిషియల్ న్యూస్ లేకపోయినా వైరల్ అవుతోంది. ఈ కాంబోను తెర మీదకు తెచ్చే నిర్మాత ఎవరో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: