మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణతేజ్ మొదటి సినిమా ముకుందా నుండి తన ప్రతి సినిమాకీ చాలా వేరియేషన్ చూపిస్తూ వస్తున్నాడు. కంచె, అంతరిక్షం, ఎఫ్ 2, గద్దల కొండ గణేష్ ..ఇలా తనకి వచ్చిన పాత్ర ఏదైనా పక్కాగా అన్ని రకాలుగా సిద్దమయ్యాకే షూటింగ్ లోకి అడుగు పెడుతున్నాడట. ఇంతకుముందు విక్టరీ వెంకటేష్ తో కలిసి నటించిన ఎఫ్-2లోనూ తెలంగాణ యాసతో మంచి కామెడీ టైమింగ్ తో అదరగొట్టి సూపర్ హిట్ ని దక్కించుకున్నాడు. ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరింది. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలని నిరంతరం తాపత్రయ పడుతుంటాడు వరుణ్ తేజ్. అంతేకాదు ఈ మేగా హీరో కథలను సెలెక్ట్ చేసుకోవడం లో డిఫ్రెంట్ గా ఆలోచిస్తున్నాడని తన సినిమాలు చూస్తే అర్థమవుతుంది.

 

మొదటి సినిమా నుంచీ తన సినిమాల్లో రెగ్యులర్ ఫార్మాట్ కాకుండా అందరిని మెప్పించే, మెస్మరైజ్ చేసే కథలను ఎంచుకుంటున్నాడు కాబట్టే కెరీర్ లో ముకుంద-  కంచె.. తొలి ప్రేమ, ఎఫ్ 2, గద్దల కొండ గణేష్ .. ఇలా వరుసగా మంచి హిట్లు తన ఖాతాలో వేసుకోగలిగాడు. ఇక వరుణ్ తేజ్ తాజాగా త్వరలో రానున్న కొత్త సినిమాలో బాక్సర్ గా కనిపించడానికి రెడీ అవుతున్నాడు. దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ చాలా రిస్కే చేస్తున్నారని తెలుస్తోంది. 

 

అల్లు అరవింద్ సమర్పణలో అల్లు వెంకటేష్ - సిద్దు నిర్మిస్తున్న ఈ సినిమాని జూలై 30వ తేదీన విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుంది. తెలుగులో ఈ బ్యూటీకి ఇదే డెబ్యూ సినిమా. ఇక వరుణ్ బాబాయ్ పవన్ కళ్యాణ్ కంటే పవర్ ఫుల్ గా నటించడానికి ప్రయత్నిస్తున్నాడట. పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమాలో బాక్సర్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇక తాజా సినిమాలో వరుణ్ లుక్ బాలీవుడ్ హీరోలకి ధీటుగా ఉందని ఇప్పటికే మన మెగా ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: