బాలీవుడ్ లో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, కోలీవుడ్ లో అజిత్ నటించిన సూపర్ హిట్ సినిమా పింక్. ఈ సినిమాని తెలుగులో నిర్మించాలని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్ణయించుకున్నారు. అదే సమయంలో దిల్ రాజుకి ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ తో సినిమాని నిర్మించాలని కోరిక ఉండేది. దాంతో ఈ సినిమాని పవన్ తో తీయాలని అనుకున్నదే ఆలస్యంగా దిల్ రాజు పవన్ కళ్యాణ్ ని కలిసి ఈ కథ గురించి చెప్పడం ఆయన ఒకే చేయడం అంతా చక చకా జరిగిపోయాయి. అదే పవన్ కళ్యాణ్ రెండేళ్ళ గ్యాప్ తర్వాత వస్తున్న రీఎంట్రీ సినిమా 'వకీల్ సాబ్'. 

 

సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేస్తున్నారు. దర్శకుడు వేణు శ్రీరాం ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడని దిల్ రాజు యూనిట్ తో చెప్పుకుంటున్నాడట. 80% షూటింగ్ కంప్లీటయిన ఈ సినిమాకి త్వరలో పోస్ట్ ప్రొడక్షన్స్ ని మొదలు పెడతారట. ఇక ఈ సినిమాలో కోర్టు సన్నివేశాలు హైలెట్ గా నిలవనున్నాయని ఆ సన్నివేశాలలో పవన్ కళ్యాణ్ అద్భుతంగా నటిస్తున్నాడని తాజా సమాచారం. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు మూడు ముఖ్య పాత్రలుంటాయి. వాటిలో ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్న నివేదా థామస్ కూడా కోర్టు సీన్స్ లో అద్బుతమైన నటనను ప్రదర్శిస్తుందట. 

 

హిందీలో ఈ పాత్రను తాప్సీ పోషించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ పింక్ సినిమాలో అమితాబ్ బచ్చన్ తర్వాత అంతగా హైలెట్ అయిన పాత్ర తాప్సీదే. తెలుగులో నివేదా థామస్ అదే పాత్ర ను పోషిస్తోంది. వాస్తవంగా తెలుగులో కూడా తాప్సీనే ముందుగా ఈ పాత్రకి అనుకున్నారు. కానీ ఆల్రెడీ తాప్సీ నటించేసింది కాబట్టి ఇపుడు తెలుగులో కూడా తాప్సీనే నటిస్తే ప్రేక్షకులు ఆసక్తి చూపించరన్న ఉద్దేశ్యంతో నివేదా థామస్ ని సెలెక్ట్ చేసుకున్నారు మేకర్స్. దాంతో ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి నటించడమే కాదు సినిమాలో ఆయన పాత్ర తర్వాత మళ్ళీ నివేదా థామస్ పాత్ర గురించి చెపుకునే విధంగా నటిస్తుందట. 

 

ఇక ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండగా... బోణీ కపూర్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ తో సినిమాకు విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా కావడంతో అటు సినీ వర్గాల్లోను ఇటు ప్రేక్షకులల్లోను భారీగా అంచనాలున్నాయి. ఇదిలా ఉంటే గత నాలుగైదు రోజులుగా ఒక న్యూస్ బాగా స్ప్రెడ్ అవుతోంది. నివేదా థామస్ కొన్ని కీలక సన్నివేశాలలో పవన్ కళ్యాణ్ ని డామినేట్ చేసే విధంగా నటిస్తుందట. ఎక్స్‌ప్రేషన్స్, యాటిట్యూడ్ లలో నివేదా దే కొన్ని సార్లు హైలెట్ అనిపిస్తుందట. మరి సినిమా రిలీజయ్యాక నిజంగా నివేదా థామస్ పవన్ కంటే హైలెట్ అయితే ఆయన ఫ్యాన్స్ తట్టుకుంటారా ..! 

మరింత సమాచారం తెలుసుకోండి: