ఆయనో తెలుగు నటుడు.. ఓ తెలుగు హీరో తమ్ముడు.. నటుడిగా కంటే డబ్బింగ్ ఆర్టిస్టుగా ఎక్కువ పేరు తెచ్చుకున్నారు. కానీ తెలుగులో కంటే కన్నడలోనే ఎక్కువగా ఫేమస్ అయ్యారు. అయితే హీరోగా కాదు సుమా... విలన్ గానే.. ఇంతకీ ఎవరా నటుడు అనుకుంటున్నారా.. ఆయనే రవిశంకర్ వర్మ.

 

 

రవి శంకర్ వర్మ అంటే వెంటనే గుర్తు పట్టకపోవచ్చు.. కానీ సాయి కుమార్ తమ్ముడు అంటే త్వరగా గుర్తుపడతారు. ఇంకొందరు సాయికుమార్ తమ్ముడు అన్నా గుర్తు పట్టకపోవచ్చు..కానీ బొమ్మాళీ అంటూ డబ్బింగ్ చెప్పిన నటుడు అంటే మాత్రం వెంటనే గుర్తు పట్టేస్తారు. ఆ పాత్రకు అంత గుర్తింపు వచ్చింది మరి.

 

 

ప్రస్తుతం ఆయన కన్నడలో విలన్ గా బాగా పేరు తెచ్చుకున్నారు. ఎంతగా అంటే.. కర్ణాటకలో ఆయన్ను చూస్తేనే మహిళలు భయపడతారట... ‘కెంపెగౌడ’ తర్వాత రవిశంకర్ వర్మ విలన్ గా నటించిన చిత్రాలన్నీ వరుసగా హిట్టయ్యాయి. తెలుగులో ‘మిర్చి’ని సుదీప్‌ తీశారు. అందులో సంపత్‌ చేసిన క్యారెక్టర్‌ ను రవిశంకర్ చేశారు. దానికీ మంచి పేరొచ్చింది.

 

 

ఆ తర్వాత ‘దండుపాళ్యం’ చేశారు. తమిళంలో విజయ్‌తో ఒక సినిమా చేశారు. ఆ సినిమాను రవిశంకర్ వాళ్లావిడతోకలిసి థియేటర్‌లో చూసి వస్తుంటే ఒకావిడ... వీడితో ఎలా సంసారం చేస్తున్నరమ్మా అని అడిగేసిందట. అదీ సంగతి.. కన్నడలో అంత ఫేమస్ విలన్ మరి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: