మెగా బ్రదర్ నాగబాబు కి కొండంత అండ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి, తమ్ముడు పవన్ కల్యాణ్ తర్వాత తన కొడుకు వరుణ్ తేజ్. ఒకప్పుడు నాగబాబు కి ఏ చిన్న కష్టమొచ్చిన కాస్త ఆలోచించేవారు. ఎవరికి చెప్పాలి. అందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి. ఎవరి బాధ్యతలు వాళ్ళకున్నాయి. అన్నయ్య ఇబ్బందులు అన్నయ్యకి, తమ్ముడి సమస్యలు తమ్ముడికి ఉన్నాయి. నా వ్యక్తిగత విషయాలు ఎవరికి చెప్పి బాధ పెట్టాలి అని నాగబాబు తనలో తానే మదనపడే వారు. ముఖ్యంగా ఆయన నిర్మించిన ఆరెంజ్ సినిమా చాలా కృంగదీసింది. ఆర్ధికంగా బాగా దెబ్బదీసింది. నమ్మకంతో వదిలేస్తే ఆ నమ్మకమే నాగబాబుని రోడ్డుమీద నించోబెట్టే పరిస్థితి తీసుకు వచ్చింది. కానీ ఆ పరిస్థితి రాకుండా ఒకవైపు అన్నయ్య చిరంజీవి మరోవైపు తమ్ముడు పవన్ కళ్యాణ్ అండగా నిలబడ్డారు.

 

అయితే ఇప్పుడు ఆ పరిస్థితి రాకుండా కొడుకు వరుణ్ బాబు నాగబాబుకి తోడుగా ఉంటున్నాడు. ముంకుంద సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన వరున్ తేజ్ ఆ సినిమాతో హీరోగా మంచి పేరు సంపాదించుకున్నాడు. మెగా ఫ్యామిలిలో ఎక్కువగా ఎక్స్‌పరిమెంట్స్ చేస్తున్న హీరో అంటే అది వరుణ్ తేజ్ అని చెప్పాలి. కంచె, అంతరిక్షం, లోఫర్, తొలిప్రేమ, గద్దలకొండ గణేష్ ఇలా డిఫ్రెంట్ జోనర్స్ లో కథలని ఎంచుకుంటూ సక్సస్ ల తో ముందుకు సాగుతున్నాడు వరుణ్ తేజ్. విక్టరీ వెంకటేష్ తో కలిసి వరుణ్ తేజ్ ఎఫ్ 2 వంటి మల్టీ స్టారర్ సినిమాలో నటించడం కూడా ఆసక్తికరమైన విషయం. ఇక తాజాగా బాక్సింగ్ బ్యాగ్డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న వరుణ్ తేజ్ మరో రెండు ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టాడని తెలుస్తోంది.

 

ఇదిలా ఉంటే వరుణ్ తేజ్ హీరో అయి సక్సస్ ఫుల్ గా సినిమాలు చేస్తూ బాగా సెటిలయ్యాడు. ఇప్పుడు నాగబాబుకి వరుణ్ బాబు వెన్నుముక లా తయారయ్యాడు. తండ్రికి ఏ చిన్న సమస్య వచ్చినా క్షణాల్లో తీరచగలిగే స్థాయికి వచ్చిన వరుణ్ తేజ్ నాగబాబుకి కొండంత అండగా నిలబడ్డాడు. ఇప్పుడు నాగబాబుకి వరుణ్ తేజ్ రీల్ లైఫ్ లో కాకుండా రియల్ లైఫ్ లో హీరోగా కనిస్తున్నాడు. అందుకే నాగబాబు .. 'వరుణ్ నా రియల్ లైఫ్ హీరో' అంటూ గర్వంగా చెప్పుకుంటున్నారు.  ఇక ఒక వైపు నిహారిక మరో వైపు వరుణ్ తేజ్ లతో నాగబాబుకి ఏ చింతా లేకుండా సరదాగా షోస్ చేస్తూ గడిపేస్తున్నారు. ఇప్పుడు నాగబాబు ఏ షోస్ చేయకపోయినా తల్లి దండ్రులిద్దరిని నెత్తిమీద పెట్టుకొని చూసుకునే స్థాయికి వరుణ్ తేజ్ వచ్చేశాడు.      

మరింత సమాచారం తెలుసుకోండి: