టాలీవుడ్ సినిమా పరిశ్రమకి కింగ్ నాగార్జున హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది బెంగళూరు భామ అనుష్క శెట్టి. అయితే తొలి సినిమాతో తన ఆకట్టుకునే అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన అనుష్క, ఆ తర్వాత మెల్లగా అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగింది. ఆ తర్వాత ఆమెకు ఒకానొక సమయంలో ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో అరుంధతి అనే సినిమాలో ప్రధాన పాత్ర పోషించే అవకాశం రావడం, ఇక ఆ సినిమాలో ఆమె అద్భుతమైన నటన కనపరచడం జరిగింది. 

 

కాగా అప్పట్లో రిలీజ్ అయిన ఆ సినిమా, అత్యద్భుత విజయాన్ని అందుకోవడంతో పాటు, ఎన్నో గొప్ప రికార్డులు కూడా నెలకొల్పింది. నటిగా అనుష్కకు మంచి గుర్తింపు తీసుకురావడంతో పాటు, ఒక స్టార్ హీరోయిన్ గా కూడా ఆమె స్టేటస్ ని మరింతగా పెంచిన సినిమా అరుంధతి. ఇక ఆ తర్వాత నుండి మరిన్ని అవకాశాలుతో దూసుకెళ్లిన అనుష్క, ఇటీవల బాహుబలి 2 భాగాల విజయాల తర్వాత ఎంతో గొప్ప పేరుని, క్రేజ్ ను సంపాదించారుజ్. అయితే ఎక్కువగా ట్రెడిషనల్ వేర్ లోనే కనబడటానికి ఇష్టపడే అనుష్క, చాలా వరకు తన సినిమాల్లో కూడా అటువంటి పాత్రలనే చేయడం జరిగింది. అయితే అక్కడక్కడా ఒకటి రెండు సినిమాల్లో మాత్రమే ఆమె రొమాంటిక్ ఫీల్ ఉన్న పాత్రల్లో నటించడం, అలానే ఆ పాత్రలకు తగ్గట్టుగా బికినీ వంటి లేటెస్ట్ స్టైల్ దుస్తులను ధరించటం జరిగింది. 

 

రెబల్ స్టార్ ప్రభాస్ సరసన బిల్లా సినిమాలో అనుష్క బికినీ ధరించిన హాట్ సీన్ అప్పట్లో పెద్ద సెన్సేషన్ అయింది. కాగా ఆ బికినీలో అనుష్క అందాలను ఆమె అభిమానులు మాత్రం ఎప్పటికీ మరిచిపోలేరనే చెప్పాలి. కేవలం అభినయం లోనే కాదు, అందంలో కూడా తాను ఇతర హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా అనుష్క ఆ బికినీ డ్రెస్ లో అదరగొట్టారు. నిజంగా ఆ బికినీలో అనుష్క అందాలు అదరహో అనే చెప్పాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: