బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ పబ్బులో జరిగిన గొడవ వల్ల హాస్పిటల్ పాలయ్యాడు. బుధవారం రాత్రి పబ్బులో తన స్నేహితులతో పార్టీ ఎంజాయ్ చేస్తున్న రాహుల్ వేరే బ్యాచ్  వచ్చి రాహుల్ తో వచ్చిన ఒక అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించారట దీనితో రాహుల్ వారి మీద గొడవ పడ్డాడట.. మాటామాటా పెరగడంతో అవతల బ్యాచ్ లో ఒకడు బీరు సీసాతో రాహుల్ తల మీద గాయం చేశాడట. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని వివరాలు సేకరించారు. గాయపడ్డ రాహుల్ ను హాస్పిటల్ లో జాయిన్ చేయించారని తెలుస్తుంది. అయితే అతని పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది. గాయం చిన్నదా లేదా పెద్దదా అన్నది తెలియాల్సి ఉంది.

 

పార్టీలు పబ్బులు అంటూ హైదరాబాద్ యూత్ ముఖ్యంగా బాగా డబ్బున్న వారు ఇలా ఎంజాయ్ చేస్తూ అనవసరమైన ఇబ్బందుల్లో పడుతున్నారు. అర్ధరాత్రి వరకు తాగుతూ రిస్క్ ఫేస్ చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 3 లో అసలు ఫేవరేట్ ఏమాత్రం కాని రాహుల్ ఫైనల్ గా టైటిల్ విన్నర్ అయ్యాడు. పునర్నవితో లవ్వు గివ్వు అంటూ షోని రంజింప చేసిన రాహుల్ కు ఆడియెన్స్ ఓట్లు వేశారు. బిగ్ బాస్ క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు రాహుల్ భారీ ప్లాన్ లే వేశాడు. ఇన్నాళ్ళు సింగర్ గానే అలరించిన రాహుల్ ఇక మీదట నటుడిగా కూడా కనిపించనున్నాడు.

 

కృష్ణవంశి రంగామార్తండా సినిమాలో రాహుల్ నటిస్తున్నాడని తెలిసిందే. సినిమాలో అతనికి మంచి పాత్ర పడ్డదట. కెరియర్ ఫుల్ జోష్ లో ఉన్న రాహుల్ అనవసరమైన గొడవల్లో చిక్కుకోవడం దురదృష్టమని చెప్పొచ్చు. ప్రస్తుతం హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ పొందుతున్న రాహుల్ హెల్త్ గురించి ఇంకా ఎలా ఇన్ఫర్మేషన్ బయటకు రాలేదు. పబ్బులో రాహుల్ తో గొడవ పడ్డ బ్యాచ్ లో వికారాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే బ్రదర్ కూడా ఉన్నాడని టాక్.     

మరింత సమాచారం తెలుసుకోండి: