హిట్ అయిన సినిమాకు ఎన్ని కారణాలైనా చెప్పొచ్చు.. స్టార్ సినిమా.. యువ హీరో సినిమా.. బొమ్మ హిట్టు కొడితే అందరి లెక్క ఒకటే. అయితే సినిమా హిట్ లో హీరోయిన్ శాతం ఎంత.. హీరోయిన్ వల్లే కొన్ని సినిమాలు ఆడేశాయి అన్న టాక్ వస్తుంటాయి. అలాంటి సినిమాలు కేవలం హీరోయిన్ వల్లే ఆడాయని అంటారా లేక కంటెంట్ ఉంది కాబట్టి సినిమా హిట్ అయిందని ఒప్పుకుంటారా.. ఒక సినిమా సూపర్ హిట్ అవడానికి ఎన్నో సమీకరణాలు ఉంటాయి. వాటిలో హీరోయిన్ కూడా ఒకటి అని చెప్పొచ్చు. అవును కొందరు సినిమా నుండి ఏదో ఒకటి నేర్చుకుందామని అనుకుంటారు.

 

కొందరు సినిమాను కేవలం రెండు గంటలు ఎంటర్టైన్ చేసే వ్యాపకంగా చూస్తారు. మరికొందరు అందులో ఉండే గ్లామర్ కోసం చూస్తారు. చూసే ప్రేక్షకుల్లో డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి. అయితే కొన్ని సినిమాలు కేవలం హీరోయిన్ ఎక్స్ పోజింగ్ మీద డిపెండ్ అవుతుంటాయి. అడల్ట్ కంటెంట్ సినిమాల్లో ఈ ప్లాన్ బాగా వర్క్అవుట్ చేస్తారు. సినిమా హిట్ అయితే ఆ హీరోయిన్ బాగా రెచ్చిపోవడం వల్లే అనేస్తారు. అయితే అందులో నిజం లేకపోలేదు. హీరో ఎంత విరగబడి నటించినా హీరోయిన్ అలా టూ పీస్ బికినిలో కనిపిస్తే చాలు టికెట్లు చిరగాల్సిందే.

 

సినిమాకు గ్లామర్ తెచ్చే అందాల భామలు వారికి ఇచ్చే పారితోషికంకు బాగా సపోర్ట్ చేస్తారు. సినిమాకు కావాల్సిన మసాలాను దట్టించి బొమ్మ ఆడేందుకు వారి వంతు కృషి చేస్తారు. ఒక సినిమాలో రెచ్చిపోయి చూపించేస్తే ఆ సినిమా కాస్త హిట్ అయితే అలాంటివి పది ఆఫర్లు పట్టేయోచ్చు అన్నది హీరోయిన్ల లాజిక్. సినిమా హిట్ కు హీరోయిన్ గ్లామర్ కూడా కొంత శాతం పనిచేస్తుంది. ఇది తప్పకుండా ఒప్పుకోవాల్సిన నిజం. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: