సినీ పరిశ్రమలో ఎంత గొప్పవారికైనా ఎత్తు పల్లాలు అనేవి సహజం.  ఒకప్పుడు స్టార్లు గా వెలుగొందిన వారు ఇప్పుడు చిన్న ఛాన్సుల కోసం పడిగాపులు కాచే పరిస్థితి.  సినిమా అంటేనే రంగుల ప్రపంచం.. ఇక్కడ అంతా జరిగినట్టే ఉంటుంది.. తీరా బయటకు వస్తే అంతా షరా మామూలే.  నటీనటులకు కూడా తెరపై ఎంత గొప్పగా ఉన్నా.. రియల్ లైఫ్ లో కష్టాలు కన్నీళ్లు తప్పవు.  కొంత మంది నటులు ఈ లాజిక్ తెలియన తమ కెరీర్ ముగిసి పోయిందని బాధపడుతూ.. జీవితాన్ని చాలించుకున్న వారు కూడా ఉన్నారు.  అయితే ఒకప్పుడు స్టార్ హోదాలో ఉండి ఇప్పుడు చిన్న పొజీషన్లోకి వచ్చామన్న బాధతో సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నవారు కూడా ఉన్నారు. 

 

ఇక కమెడియన్ గా కెరీర్ ప్రారంభించిన స్టార్ కమెడియన్ లీస్ట్ లోకి వెళ్లిపోయిన సునీల్.. ఒక్కసారే హీరోగా అందాలరాముడు లో దుమ్ముదుళిపాడు.  స్టార్ హీరోలకు ఏమాత్రం తక్కువ కాకుండా తన డ్యాన్స్ పర్ఫామెన్స్ తో దులిపేశాడు.  ఆ తర్వాత మర్యాద రామన్న, పూలరంగడు ఇలా వరుసగా విజయాలు అందుకున్నాడు.  కానీ టైమ్ అందరికీ కలిసి రాదు.. సునీల్ నటించిన సినిమాలు వరుసగా డిజాస్టర్ అయ్యాయి.  ఒకదశలో ఆయనతో సినిమాలు అంటే దర్శక, నిర్మాతలు పారిపోయే పరిస్థితి నెలకొంది.  దాంతో కెరీర్ సాఫీగా సాగాలంటే యూటర్న్ తీసుకోక తప్పదని భావించిన సునీల్ మళ్లీ కామెడీ పాత్రలకు జై కొట్టారు.  అంతే కాదు రొటీన్ కి భిన్నంగా విలన్ అవతారం కూడా ఎత్తుతున్నారు. 

 

రవితేజ నటించిన ‘డిస్కోరాజా’ లో ఆయన విలన్ గా నటించాడు.  అంతే కాదు ప్రస్తుతం కలర్ ఫోటో మూవీలో ఫుల్ లెన్త్ విలన్ గా నటిస్తున్నారు.  అంతే కాదు ఓ వైపు హీరోల ఫ్రెండ్స్ పాత్రల్లో కూడా నటిస్తున్నాడు.  త్వరలో క్రిష్ - పవన్ కళ్యాన్ కాంబినేషన్ లో వస్తున్న మూవీలో పవన్ స్నేహితుడిగా నటంచబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాకపోతే ఇది అఫిషియల్ గ ప్రకటించలేదు. అయితే ప్రస్తుతం తాను తీసుకున్న నిర్ణయానికి చాలా సంతోషంగా ఉన్నాని.. గతంలో కొన్ని ఇబ్బందులు పడ్డానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు సునీల్. 

మరింత సమాచారం తెలుసుకోండి: