సన్న నడుము సుందరి..  నాజూకు సుంద‌రి.. నడుము వంపుల సుందరి.. తేనెకళ్ళ అమ్మాయి ఈ పేర్లు అన్ని ఎవరికి అనుకుంటున్నారా తన చిట్టి నడుము తో టాలీవుడ్‌ను కొన్నేళ్లపాటు మాయ‌ చేసిన ఇలియానా. 2005లో రామ్ హీరోగా వైవియస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన దేవదాసు సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయిన భామ‌ ఇలియానా. తొలి సినిమాతోనే తన అందచందాలతో నాజూకైన నడుము కొట్టేసింది దేవదాసు సినిమాలో సాంగ్స్ లో ఇలియానా తన నడుమును ఊపుకుంటూ నడుచుకుంటూ వెళుతున్నప్పుడు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇలియానా అందాలు పదేపదే చూసేందుకే దేవదాసు సినిమా చూడడంతో ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అక్కడి నుంచి ఒక్కసారిగా ఆమె క్రేజ్‌ పెరిగిపోయింది. వరుసగా మహేష్ బాబుతో పోకిరి పవన్ కళ్యాణ్ జల్సా ఎన్టీఆర్ తో రాఖీ ఇలాంటి సినిమాల్లో ఛాన్సులు రావడం తో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయింది.

 

 అయితే అదే టైంలో తెలుగు సినిమాల కంటే బాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగి పోవాల‌న్న‌ ఆశతో అక్క‌డ‌కి వెళ్ళిపోయింది. ఇక్కడ స్టార్ స్టేటస్ బాలీవుడ్ కి వెళ్లి బొక్క బోర్లా పడింది. ఇలియానా నటన కంటే ఆమె శరీర ఆకృతికి బాగా పడిపోయే వాళ్ళు ఇలియానా బాడీ మన తెలుగు కుర్రకారుకు బాగా నచ్చేసింది. ఈ క్రమంలోనే చాలా సినిమాల్లో తన అందాలను ఆరబోసేందుకు ఇలియానా ఎంతమాత్రం మొహమాట పడేది కాదు. నాకు సెక్స్ అంటే చాలా ఇష్టమని సెక్స్‌లో పాల్గొంటే తాను పరవశించి పోతాం అని బోల్డ్ స్టేట్మెంట్ ఎన్నోసార్లు ఇచ్చిన ఇలియానా పోకిరి సినిమాల్లో తన బికినీ అందాలు చూపించింది.

 

 పోకిరి లో బ్లూ కలర్ బికినీ వేసిన ఇల్లు బేబీ రవితేజ హీరోగా వచ్చిన కిక్ సినిమాలో మరోసారి బ్లాక్ కలర్ బికినీ వేసి తన అందాలను చూపించింది. ఇలియానాకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతూ ఉండగానే ఆమె ఇక్కడ మంచి అవకాశాలు చేజేతులా వదులుకొని బాలీవుడ్ వెళ్ళిపోయింది. ఆ తర్వాత అక్కడ జనాలు పట్టించుకోకపోవడంతో టాలీవుడ్ కు వచ్చిన అప్పటికే ఇలియానా హీరోయిన్ అయిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: