మారుతున్న కాలానికి అనుగుణంగా హీరోయిన్ల గ్లామర్ షో కూడా శృతి మిన్చేస్తుంది. క్యారక్టర్ డిమాండ్ చేయాలే కాని న్యూడ్ గా కూడా నటించడానికి రెడీ అంటూ చెప్పే హీరోయిన్స్ కూడా ఉన్నారు. అయితే అవసరం ఉన్నా లేకున్నా బికినితో రచ్చ చేయడం మాత్రం ఆపట్లేదు. తెలుగు సినిమాల్లో కూడా ఈమధ్య హీరోయిన్ ల బికినీ హంగామా బాగా పెరిగింది. అయితే దీనికి స్పూర్తి మాత్రం బాలీవుడ్ సినిమాలే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

 

ఇక బికినీల గురించి ప్రస్తావిస్తే ఒక హీరోయిన్ ఆ బికినీకి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పాల్సిందే. ఆమె ఎవరో కాదు దిశా పటాని. కెల్విన్ క్లెయిన్ లో దుస్తుల కోసం దిశా చేసే హాట్ షో గురించి ఎంత చెప్పినా తక్కువే. కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తున్న ఈ భామ బికినీ వేసి రచ్చ రచ్చ చేస్తుంది. మాములుగా ఏదైనా పండుగ వస్తే స్టార్ హీరోలు, హీరోయిన్స్ విషెస్ గురించి వెయిట్ చేస్తాం.. కాని దిశా పటాని మాత్రం ఆరోజు చేసే బికినీ షో గురించి వెయిట్ చేసేలా చేసింది. పండుగ ఏదైనా తన బికినీ షో ఉండాల్సిందే.

 

సినిమాల్లో పెద్దగా గుర్తింపు తెచ్చుకొని దిశా పటాని బికినిలతో రెచ్చిపోవడం వల్ల క్రేజ్ తెచ్చుకుంది. ఆ క్రేజ్ తోనే ఇప్పుడు వరుసగా బాలీవుడ్ చాన్సులు పట్టేస్తుంది. ఇదివరకు బాలీవుడ్ లో ఆమెను పట్టించుకోని స్టార్స్ బికినీ షోతో వారి దృష్టిలో పడటంతో పిలిచి మరి అవకాశాలు ఇస్తున్నారు. సల్మాన్ భరత్ లో నటించినదిశా ఇటీవలే మలంగ్ సినిమా చేసింది. సల్మాన్ రాబోతున్న సినిమాలో కూడా దిశానే హీరోయిన్ గా తీసుకున్నారట. మొత్తానికి బికినితో అమ్మడు బాగా మైలేజ్ ఏర్పడేలా చేస్తుందని చెప్పొచ్చు.  తెలుగులో కూడా ఆమెకు అవకాశాలు వస్తున్నాయని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: