పవర్ స్టార్ పవన్ కళ్యాన్ రెండేళ్ళ తర్వాత బాలీవుడ్ రీమేక్ పింక్ సినిమాతో సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అజ్ఞాతవాసి వంటి డిజాస్టర్ తర్వాత పవన్ సినిమాల్లో చేయనని చెప్పడంతో ఆయన అభిమానులు చాలా నిరాశ చెందారు. కానీ మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తున్నాడని తెలియగానే సంతోషంతో ఉప్పొంగిపోయారు. రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ కోసం ముఫ్పై రోజుల సమయాన్ని ఇచ్చాడట.

 

 

అయితే మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా ఫస్ట్ లుక్ ని రివీల్ చేశారు. వకీల్ సాబ్ అనే టైటిల్ తో పవన్ పవన్ లుక్ ని విడుదల చేశారు. వకీల్ సాబ్ లుక్ ప్రస్తుతం ట్రెండింగ్ లో నడుస్తుంది. చేతిలో పుస్తకం పట్టుకుని కుర్చీకి కాళ్ళు ఆనించి దర్జాగా కూర్చున్న పవన్ కళ్యాణ్ లుక్ అందరికీ తెగ నచ్చేసింది. తెలుగు ప్రేక్షకులతో పాటుగా, ఆయన్ని అభిమానించే ప్రతీ ఒక్కరూ ఈ లుక్ చూసిన తర్వాత సినిమా చూడాలని తహతహలాడుతున్నారు.

 

అయితే ఈ లుక్ పై ఎన్ని ప్రశంసలు వచ్చాయో అందరికీ తెలిసిందే. టాలీవుడ్ సెలెబ్రిటీస్ అందరూ వకీల్ సాబ్ లుక్ మీద కామెంట్స్ చేశారు. ఎన్ని ప్రశంసలు దక్కాయో అన్ని విమర్శలని కూడా తెచ్చిపెట్టుకుంది ఈ లుక్. నిజానికి పింక్ సినిమా కథాంశం ప్రకారం పవన్ కళ్యాణ్ పాత్ర చాలా తక్కువగా ఉంటుందట. ముగ్గురు అమ్మాయిలకి సాయం చేసే మాదిరిగా ఉంటుందే తప్ప ఏమాత్రం హీరో ఎలివేషన్స్ తో కూడి ఉండదట. 

 

కానీ ఫస్ట్ లుక్ ని చూస్తే మాత్రం ఇదేదో హీరోయిజం ఉన్న సినిమాలాగా కనిపిస్తుందని అంటున్నారు. ముఖ్యంగా స్త్రీ వాదులు ఈ విషయమై చాలా కోపంగా ఉన్నారు. కథా పరంగా స్త్రీ పాత్రలకే ఎక్కువ ప్రాముఖ్యత ఉన్న నేపథ్యంలో ఫస్ట్ లుక్ పై వారి పాత్రలని ఉంచకపోవడంపై గరం గరంగా ఉన్నారు. ఈ విషయమై ఒరిజినల్ పింక్ సినిమా పోస్టర్ ని చూపిస్తూ.. వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ ఇలా ఉండాలని సూచిస్తున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: