తెలుగు సినిమా హీరోయిన్లలో తొంభైల చివర్లో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ సిమ్రాన్. ముంబై నుంచి టాలీవుడ్ కి వచ్చిన ఈ బ్యూటీ అప్పట్లో నెంబర్ వన్ హీరోయిన్ గా రాణించింది. ఏక కాలంలో తెలుగు, తమిళ సినిమాల్లో స్టార్ హీరోయిన్ క్రేజ్ దక్కించుకుంది. దాదాపు అందరి స్టార్ హీరోలతో నటించిన సిమ్రాన్ దాదాపు ఐదేళ్లు తన హవా కొనసాగించింది. తెలుగులో ఆమె మొదటి సినిమా 1997లో వచ్చిన సుమన్ హీరోగా నటించిన అబ్బాయిగారి పెళ్లి. తమిళ్ లో వచ్చి తెలుగులో కూడా డబ్ అయిన రాజేశ్వరి కల్యాణం సినిమానే మళ్లీ తీసారు.

 

 

ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సిమ్రాన్ స్విమ్ సూట్ వేసి ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. స్విమ్ సూట్ కు తగ్గట్టు పర్ఫెక్ట్ బాడీ సిమ్రాన్ సొంతం. ఆ సినిమా తర్వాత సిమ్రాన్ మరి వెనుతిరిగి చూడలేదు. ఆ సినిమా పెద్దగా ఆడకపోయినా అడపాదడపా అవకాశాలు సిమ్రాన్ ను వరించాయి. తర్వాత 1999 సంక్రాంతికి బాలకృష్ణ హీరోగా వచ్చిన సమరసింహారెడ్డి సినిమా ఆమె కెరీర్ ను మలుపు తిప్పింది. ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ కావడంతో సిమ్రాన్ స్టార్ హీరోల పక్కన మెయిన్ ఆప్షనల్ హీరోయిన్ గా మారిపోయింది. అప్పటివరకూ టాలీవుడ్ ను శాసిస్తున్న సౌందర్య హవాకు చెక్ పెట్టింది సిమ్రాన్.

 

 

ఇదే సమయంలో తమిళ్ నుంచి కూడా వరుస ఆఫర్లు వచ్చాయి. వాలి సినిమా ఆమె కెరీర్ ను మలుపుతిప్పింది. నెంబర్ వన్ హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలో చిరంజీవి అన్నయ్య సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. చిరంజీవితో హీరోయిన్ గా మినహాయిస్తే బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ లతో ఆమె సిల్వర్ జూబ్లీ సినిమాలు ఇచ్చి నెంబర్ వన్ హీరోయిన్ అనిపించుకుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: