డైరక్టర్ గానే కాకుండా తనకు వచ్చిన లైన్లతో యువ హీరోలతో కూడా సినిమాలు చేస్తుంటాడు. కుమారి 21 ఎఫ్ తో నిర్మాతగా మారిన సుకుమార్ ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. సుకుమార్ కథ అందించిన ఆ సినిమాను సూర్య ప్రతాప్ డైరెక్ట్ చేశారు. ఆ సినిమాతోనే రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ ఇద్దరు సూపర్ పాపులర్ అయ్యారు. ఇక ఆ సినిమా తర్వాత సుకుమార్ దర్శకుడు సినిమా చేశాడు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇక లేటెస్ట్ గా మళ్ళీ కుమారి 21 ఎఫ్ కాంబోలో మూవీ వస్తుంది.   

 

కుమారి డైరక్టర్ సూర్య ప్రతాప్, సుకుమార్ రైటింగ్స్ కాంబినేషన్ లో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో వస్తున్న సినిమా 18 పేజెస్. ఈ సినిమాలో నిఖిల్ హీరోగా నటిస్తున్నాడు. సినిమాకు ఈరోజు ముహూర్తం పెడుతున్నారు. ఈ సందర్భంగా సినిమా టైటిల్ ఎనౌన్స్ చేశారు. 18 పేజెస్ వెరైటీ టైటిల్ తో వస్తున్న ఈ మూవీకి సుకుమార్ మార్క్ కచ్చితంగా ఉండేలా ఉంది. హ్యాపీడేస్ సినిమా నుండి అర్జున్ సురవరం సినిమా వరకు తన పంథాలో తను సినిమాలు చేస్తూ వెళ్తున్న నిఖిల్ కు గీతా ఆర్ట్స్, సుకుమార్ కలిసి అవకాశం ఇవ్వడం గొప్ప విషయమని చెప్పోచ్చు.

 

యవ హీరోలు ఇలాంటి పెద్ద బ్యానర్ లో సినిమాలు చేస్తే క్వాలిటీ పరంగా చాలా బాగుటుంది. అంతేకాదు గీతా ఆర్ట్స్ 2 వరుస హిట్లతో సూపర్ ఫాం లో ఉంది. అందుకే బన్ని వాసు నిర్మాత అనగానే ఆ సినిమాపై మాములుగానే అంచనాలు ఏర్పడతాయి. ఈ సినిమాతో పాటుగా చందు మొండేటి డైరక్షన్ లో కార్తికేయ 2 సినిమా చేస్తున్నాడు నిఖిల్. చూస్తుంటే నిఖిల్ కు మంచి రోజులు వచ్చేలా ఉన్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: