ఘట్టమనేని మహేష్ బాబు.. తెలుగు సినిమాలోని డైలాగులను గడగడలాడిస్తాడని పేరు ఉంది.. ఈ పండుగాడి నోటి నుండి వచ్చే డైలాగులకు ఫిదా కాని అభిమాని ఉండడు.. తెలుగులో డైలాగ్ ఇలానే చెప్పాలని మైండ్‌లో ఒక్కసారి ఫిక్స్ అయితే బ్లైండ్‌గా బుల్లెట్ కంటే వేగంగా డైలాగ్ తో దూసుకెళ్లుతాడు అనే టాక్ ఉంది.. ఇక మహేష్ డైలాగ్ డెలివరిని చూస్తే సాఫ్ట్‌లో సాఫ్ట్‌గా.. రఫ్‌లో రఫ్‌గా ధియోటర్స్‌లో దద్దరిల్లిపోతుంది..

 

 

చిత్రపరిశ్రమలోకి వచ్చిన కొద్ది కాలంలోనే విశేషంగా అభిమానులను సంపాదించుకున్న మన టాలీవుడ్ యువరాజుకు తెలుగు రాదట.. అంటే అర్ధం కాలేదా.. తెలుగు మాట్లాడటం వచ్చు కాని రాయటం, చదవటం మాత్రం రాదట.. అయ్యోరామా మా అభిమాన హీరో మన మాతృభాషలో ఇంత వీక్‌గా ఉన్నాడా అని అభిమానులు ఫీలవకండి.. ఎందుకంటే మహేష్ పుట్టింది పెరిగింది అంతా తమిళనాడు రాజధాని చెన్నైలోనే.. అక్కడే ఆయన చదువు కున్నాడు. ఇదివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ కు రాకముందు చెన్నైలోనే ఉండేది. కాబట్టి కృష్ణతో పాటు ఆయన భార్య పిల్లలు చెన్నైలోనే ఉండడంతో మహేష్ బాల్యమంతా చైన్నైలోనే సాగింది.

 

 

ఇలా మహేష్ విద్యాభ్యాసం అంతా చెన్నైలోనే సాగడంతో ఆయన ఫ్రెండ్స్ అంతా అక్కడే ఉన్నారట. ఇకపోతే తమిళ్ స్టార్స్ కార్తి, సూర్య లు కూడా మహేష్ బాబు స్కూల్ మేట్స్ అంట.. అయితే చిత్రపరిశ్రమ హైదరాబాద్ వచ్చేశాక మహేష్ కు స్నేహితులు తగ్గిపోయారని, అందుకే ఎప్పుడూ చెన్నై వెళ్లిన తన చిన్ననాటి స్నేహితులను కలుసుకొని వారితో సరదాగా గడుపుతాడట..

 

 

సో మహేష్ బాబు తమిళ మీడియంలో చదవడంతో తెలుగులో రాయడం రాదన్న మాట, కానీ తమిళ్ మాత్రం బాగా వచ్చట.. ఇక డిగ్రీ కామర్స్ చదివిన మహేష్ తండ్రి బాటలో నటుడిగా మారి ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీని రారాజులా ఏలుతు, తెలుగు అభిమానుల గుండెల్లో నిలిచిపోయాడు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: