సినిమాల్లో అవకాశాలు ఎవరికెలా.. ఎప్పుడొస్తాయో తెలీదు. కష్టపడినా, తనను తాను ప్రూవ్ చేసుకున్నా కూడా అదృష్టం ఉండి తీరాల్సిందే. అందుకే ఇండస్ట్రీలో పనసకాయంత టాలెంట్ ఉంటే సరిపోదు.. ఆవగింజంత అదృష్టం ఉండాలి అనే సామెత చెప్తూంటారు. ప్రస్తుతం ఇలాంటి అదృష్టాన్నే సొంతం చేసుకున్నాడు కొత్త దర్శకుడు కరుణ కుమార్. రేపు విడుదల కాబోతున్న పలాస 1978 సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇందుకు కారణం.. ఈ సినిమాను  చూసిన మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ దర్శకుడి పనితీరను మెచ్చుకుని ఓ బంపర్ ఆఫర్ ఇవ్వడమే.

 

 

టాలెంట్ ఉంటే పిలిచి అవకాశాలిచ్చి ప్రోత్సహించడం మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కు అలవాటు. యూవీ క్రియేషన్స్ తో కలిసి గీతా ఆర్ట్స్ ద్వారా సినిమా పంపిణీ చేస్తున్నాడు అల్లు అరవింద్. దీంతో నిన్న హైదరాబాద్ లో ఈ సినిమా ప్రిమియర్ ను చూసిన అల్లు అరవింద్ దర్శకుడు కరుణ కుమార్ పనితీరుకు ముగ్దుడైపోయడట. సినిమా చూసిన వెంటనే కరుణ కుమార్ ను అభినందించడమే కాకుండా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా చేసే అవకాశం ఇస్తానని మంచి కథ ప్రిపేర్ చేయమని అన్నాడట. అరవింద్ రూపంలో అదృష్టం తన తలుపు తట్టడంతో కరుణ కుమార్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయట.

 

 

అల్లు అరవింద్ కూడా నిన్న ఇచ్చిన మాటను ఈరోజు నిజం చేసుకోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఈరోజు గీతా ఆర్ట్స్ ఆఫీస్ లో దర్శకుడు కరుణ కుమార్ కు అడ్వాన్స్ చెక్ ఇవ్వడం కూడా జరిగిపోయింది. దీంతో అల్లు అరవింద్ గట్స్ కు అందరూ శెభాష్ అంటున్నారు. తొలి సినిమా కూడా విడుదల కాకముందే ఓ దర్శకుడికి అవకాశం ఇవ్వడమంటే మాటలు కాదు. మరి కరుణ కుమార్ ఏ కథ సిద్ధం చేస్తాడో.. అరవింద్ మాట ఎలా నిలబెడతాడో చూడాల్సిందే.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

#AlluAravind garu congratulated & handed over an advance cheque today to director @iamkarunakumar to direct a film under @geethaarts after watching #Palasa1978 movie.

A post shared by geetha Arts (@geethaarts) on

మరింత సమాచారం తెలుసుకోండి: