విజయ్ దేవరకొండ కి సినీ ఇండస్ట్రీలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేవలం టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ హీరోయిన్లు సైతం విజయ్ దేవరకొండ అంటే పడి చచ్చిపోతారూ. ఇప్పటికే ఎంతోమంది బాలీవుడ్ హీరోయిన్లు కూడా విజయ్ తో నటించే ఛాన్స్ వస్తే బాగుండు అని వీడియో ముందే  చెప్పేశారూ. ఇక టాలీవుడ్ లో కూడా విజయ్ సరసన ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు చాలామంది. ఈ నేపథ్యంలో ఎవరికైనా విజయ్ దేవరకొండతో నటించేందుకు ఛాన్స్ వచ్చింది అనుకొండి అలాంటి ఛాన్స్ మిస్ చేసుకుంటారా... కానీ ఇక్కడ ఒక హాట్ బ్యూటీ  మాత్రం విజయ్ సినిమాలో నటించడానికి వచ్చిన ఛాన్స్ మిస్ చేసుకుంది. విజయ్ సినిమాల్లో నటించను అని చెప్పేసింది. 

 

 

 అయితే తాజాగా విజయ్ దేవరకొండ ఏకంగా నలుగురు భామలతో రొమాన్స్ చేసి లిప్ లాక్ ల తో పిచ్చెక్కించిన... ఆ సినిమా అంతగా ప్రేక్షకాదరణ మాత్రం పొందలేకపోయింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరో గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య ఫైటర్  సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ సినిమాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ అనన్య పాండే  నటిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా విజయ్ దేవరకొండ  ఫైటర్ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ఓ వార్త హల్చల్ చేస్తోంది. ఫైటర్ మూవీ లో ముందుగా ఓ బాలీవుడ్ బ్యూటీ తీసుకోవాలని అనుకోవాలనుకున్నారని... కానీ ఆమె విజయ్ సినిమాకు నో చెప్పడంతో.. అనన్య  పాండేను తీసుకున్నారు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. 

 

 

 ఇంతకీ హీరోయిన్ ఎవరూ అంటే.. బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటాని. ముందుగా ఫైటర్ సినిమా కోసం ఈ అమ్మడిని సంప్రదించాడట దర్శకుడు పూరి. అయితే వాస్తవంగా దిశాపటాని వెండితెరకు పరిచయం చేసింది పూరీ జగన్నాథ్. వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన లోఫర్ సినిమా లో దిశాపటాని సినిమా లోకి అడుగుపెట్టింది. ఇదిలా ఉంటే తాజాగా విజయ్ దేవరకొండతో ఆఫర్ ని.. పూరి అడిగాక కూడా  సున్నితంగా తిరస్కరించిందట  ఈ అమ్మడు. దీంతో ఆ ప్లేస్ లో  అనన్య పాండే ఎంట్రీ ఇచ్చిందని ప్రస్తుతం ఓ వార్త ఇటు టాలీవుడ్ లో అటు బాలీవుడ్లో హల్చల్ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: