ప్రస్తుతం టాలీవుడ్ లో అంచెలు అంచెలు గా ఎదిగిన హీరోల్లో నానీ ఒకడు. టాలీవుడ్ లో ఇంత తక్కువ కాలంలో అంత మంచి పేరు తెచ్చుకున్న నటుడు ఎవరూ లేరు. కొంత మంది ఉన్నా సరే ఎక్కువ కాలం నిలబడలేదు. టాలీవుడ్ లో నానీకి మంచి గుర్తింపు ఉంది. వరుస విజయాలు నమోదు చేసాడు నానీ. ఇప్పుడు అగ్ర దర్శకులతో, అగ్ర నిర్మాతలతో సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాల తర్వాత నానీ చేతిలో మరికొన్ని సినిమాలు ఉన్నాయి. వాటిని త్వరగా పూర్తి చేసి అగ్ర హీరోలకు పోటీ ఇవ్వాలని భావిస్తున్నాడు. 

 

ఇంత వరకు బాగానే ఉన్నా నానీ ని మెగా ఫ్యామిలీ టార్గెట్ చేసింది అంటూ సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ వినపడుతున్నాయి. దానికి కారణం ఏమీ లేకపోయినా కొందరు మాత్రం అనవసర ప్రచారం ఎక్కువగా చేస్తూ నానీ ని ఇలాంటి చెత్త కామెంట్స్ తో ఇబ్బంది పెడుతున్నారు. నానీ అగ్ర హీరో అవ్వడం ఒక మెగా హీరోకి ఇష్టం లేదని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అందుకే నానీ చేసిన సినిమాలకు ఆ మెగా హీరో నెగటివ్ గా రివ్యు లు రాయించడం మొదలుపెట్టాడని అంటున్నారు. అదే విధంగా నానీ చేసే నిర్మాతలతో కూడా గొడవ పడినట్టు ప్రచారం చేస్తున్నారు. 

 

ఒక అగ్ర నిర్మాతకు నానీ లక్కీ హీరోగా ఉన్నాడు. అతని తో సినిమా చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. తాను ఆ అగ్ర నిర్మాతతో సినిమా చెయ్యాలని కోరినా సరే అంగీకరించలేదు అని నానీ తనతో సినిమా చెయ్యాలని ఆ అగ్ర నిర్మాత మీద ఎక్కువగా ఒత్తిడి తీసుకురావడం తో తనను వదిలేసి నానీ తో సినిమా చేసాడని ఆ మెగా హీరో భావిస్తున్నాడట. ఇటీవల ఈ విషయాన్ని కూడా చిరంజీవి వద్దకు తీసుకుని వెళ్ళాడట సదరు మెగా హీరో.

మరింత సమాచారం తెలుసుకోండి: