హెబ్బా పటేల్ కుమారి 21f  అనే సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచమైంది. ఈ సినిమాలో ఈ అమ్మడు చేసిన నటనకి టాలీవుడ్  ఫిదా అయింది. ముఖ్యంగ చెప్పాలి అంటే హాల్స్ కావాలా అనే డైలాగ్ తో కుర్రకారు ని ఫిదా చేసింది. అంతగా తన నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమాలో రాజ్ తరుణ్ పక్కన జోడి కట్టింది. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా బాక్సఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టింది. పాప ఫస్ట్ సినిమాతోనే హిట్ కొట్టేసింది. ఇంకా హెబ్బా కి తిరుగులేదు అనుకున్నారు అందరూ. అనుకున్నట్టే వరుస ఆఫర్లు అమ్మడుకి క్యూ కట్టాయి.

 

హెబ్బా నటించిన సినిమాలు కూడా పరవాలేదు అనిపించాయి. నిఖిల్ పక్కన నటించిన  ఎక్కడికి పోతావ్ చిన్నవాడా అనే సినిమా కూడా బాక్సఫీస్ వద్ద హిట్ గా నిలిచింది. ఇక్కడ వరకు బాగానే ఉన్న అమ్మడుకి ఆసలైన సినీ కష్టాలు మొదలుఅయ్యాయి. కధలు ఎంచుకోవడం తేలికో మరి దర్శక ,నిర్మాతలు పట్టించుకోకో అమ్మడు కెరియర్ గాడి తప్పింది. నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, ఏంజెల్, ఈడోరకం, ఆడోరకం, అందగాడు, మిస్టర్ సినిమాల్లో నటించిన ఆ సినిమాలు బాక్సఫీస్ వద్ద బోర్లా పడ్డాయి.

 

హెబ్బా రూట్ మార్చింది అనే చెప్పాలి. ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అవకుండా హీరోయిన్ గా కాకపోయినా స్పెషల్ పాత్రల తో సహాయ నటిగా నటింస్తుంది. రీసెంట్ గా వచ్చిన నితిన్ సినిమా లో ప్రత్యేక అతిధి పాత్రలో నటిచింది, అంతే కాకుండా రామ్ రెడ్ అనే సినిమాలో స్పెషల్ ఐటెం సాంగ్ చేస్తోంది అని ఇండస్ట్రీలో టాక్. సినిమా నుంచి పూర్తిగా తప్పుకోకుండా వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటుంది. దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకోవడం అంటే ఇదేనెమో. భవిష్యత్తులో అయినా పాప మంచి సినిమాల్లో నటిస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: