సావిత్రి.. కాదు మహానటి. సావిత్రిమ్మ గురించి ఎంత చెప్పిన తక్కువే. అభిమానులు చేత మహానటి గా కీర్తింపబడింది. తెలుగు, తమిళం లో తనదైన ముద్ర వేసుకుంది. ఎందరో మన్నలను పొందింది ప్రపంచమంతా అభిమానులను సంపాదించుకుంది. వెండి తెరపై మహారాణి గా వెలిగింది. కానీ ని జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించింది. ఆమె కష్టాలు కొని తెచ్చుకుంది. అది పెళ్ళితోనే తమిళ నటుడు అయిన జెమినీ గణేష్ ని వివాహం చేసుకుంది. అతనికి అప్పటికే రెండు పెళ్లిళ్లు అయ్యాయి. ప్రేమ మైకం లో అతని పెళ్లి చేసుకొని ఎన్నో కష్టాలు అనుభవించింది కానీ వెండి తెరపై మహానటి గా నీరాజనాలు అందుకుంది.


శ్రీదేవి... కాదు అతిలోకసుందరి దేవతలు ఎలా ఉంటారో తెలీదు కానీ శ్రీదేవిని చూస్తే ఆకాశం నుంచి దిగివచ్చిన దేవతల ఉంటది. ఆ స్థాయి అందం ఆమె సొంతం ఆమెకు మాత్రమే సొంతం అంత అందం, అభినయంతో ఇండియన్ సినిమాను ఒక ఊపు ఊపింది. జగదేకవీరుడు అతిలోక సుందరి లో ఈమె చేసిన నటన కి టాలీవుడ్ దాసోహం అయింది. మానవ మానవా అంటూ ఆమె పలికిన చిలక పలుకులు  ఇంకా చెవుల్లో మోగుతూనే ఉన్నాయి. కుర్ర కారు గుండెల్లో గుడి కట్టుకుంది. కానీ నిజ జీవితం లో తానూ ఓడిపోయింది. బాలీవుడ్ కి సంబంధించిన బోనీ కపూర్ వివాహం చేసుకుంది.ఆ వివాహమే ఆమె తలరాత మారిపోయింది కోరి కోరి కష్టాలు తెచ్చుకుంది. అయినా తెలుగు సినిమా బ్రతికే వరకు ఆమె ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోతుంది.


సౌందర్య.. అభినయానికి ,అందానికి మారు పేరు. ఆమె పేరులోనే సౌందర్యం దాగి ఉంది. నటన ఆమె నరనరాల్లో తాండవిస్తుంది. అంత అందం గా నటిస్తుంది ఎన్నో హావభావులు  చూపిస్తుంది, కవ్విస్తుంది, మైమరిపిస్తోంది. అంతగా అందరిని ఆకట్టుకున్నది. ముఖ్యంగా చెప్పాలి అంటే పవిత్రబంధం లో ఈమె చేసిన నటనకు మహిళలు ఆమెని ఇంట్లో అమ్మాయిలా చేసుకున్నారు. అంతగా అందరిని కట్టిపడేసింది. నిజ జీవితం లో ఈమె జీవితం మధ్యలోనే ఆగిపోయింది.  వచ్చింది అయిన కొన్ని కోట్ల అభిమానులను సంపాదించుకొని ఆకాశానికి ఎగిరింది ఈ అందమైన తార.

మరింత సమాచారం తెలుసుకోండి: