మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అజ్ఞాత‌వాసి సినిమాతో పోయిన క్రేజ్ అంతా అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ‌, అల వైకుంఠ‌పుర‌ములో సినిమాల‌తో తెచ్చేసుకున్నాడు. అల వైకుంఠ‌పుర‌ములో సినిమా బాహుబలి సినిమా మిన‌హా మిగిలిన సినిమాల రికార్డుల‌కు పాత‌రేసి నాన్ బాహుబ‌లి హిట్‌గా అవ‌త‌రించ‌డంతో ఇప్పుడు త్రివిక్ర‌మ్ క్రేజ్ మామూలుగా లేదు. ఇక త్రివిక్ర‌మ్ సినిమాల క‌థ‌ల‌కు గ‌తంలో ఎక్క‌డో ఓ చోట నుంచి ప్రేర‌ణ ఉంటుంద‌న్న టాక్ అయితే ఉంది.



అ..ఆ సినిమాకు మీనా న‌వ‌ల‌.. అజ్ఞాత‌వాసి సినిమాకు ఫ్రెండ్ సినిమా లార్గోవిచ్ మూలం అన్న విమ‌ర్శ‌లు త్రివిక్ర‌మ్ ఎదుర్కొన్నారు. ఇక ఈ సంక్రాంతికి హిట్ కొట్టిన బ‌న్నీ అల వైకుంఠ‌పుర‌ములో సినిమాకు చిరు ఇంటి గుట్టు ప్రేర‌ణ అన్న టాక్ కూడా వ‌చ్చింది. అయితే ఈ కాపీల గోల ఇక్క‌డితో ఆగేది లేదు. త్రివిక్ర‌మ్ నెక్ట్స్ సినిమా ఇప్ప‌టికే ఎన్టీఆర్‌తో క‌మిట్ అయ్యాడు.  'అయినను పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ పరిశీలిస్తున్నారని టాక్ కూడా ఉంది.  



సినిమా కూడా గ‌తంలో వ‌చ్చిన ఓ సినిమా ప్రేర‌ణ‌తోనే ఉంటుంద‌న్న టాక్ వినిపిస్తోంది. చిరు హీరోగా తెర‌కెక్కిన మంత్రి గారి వియ్యంకుడు సినిమా మూలం నుంచి తీసుకుని ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా 1983లో రిలీజ్ అయ్యి అప్ప‌ట్లో సూప‌ర్ హిట్ అయ్యింది.
బాపు ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్క‌గా.. కామెడీ, ఫైట్స్‌, యాక్ష‌న్‌, ఎమోష‌న్ అన్ని మిక్స్ అయిన క‌థ ఇది.



అధికారం ఉంద‌న్న గ‌ర్వంతో విర్ర‌వీగే మామ‌కు బుద్ధి చెప్పే హీరో క‌థే ఈ సినిమా. ఏదేమైనా త్రివిక్ర‌మ్ సినిమా ఇంకా సెట్స్ మీద‌కు వెళ్ల‌కుండానే ఈ సినిమా కాపీ అన్న పుకార్లు వ‌స్తున్నాయి. మ‌రి వీటిల్లో నిజానిజాలు ఏంటో ?  చూడాలి. వ‌చ్చే స‌మ్మ‌ర్‌లో ఈ సినిమా రిలీజ్ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: