ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్.. ప్రజలను మనశాంతి లేకుండా చేస్తుంది. ఎక్కడ వైరస్ అంటుకుంటుందో అని ప్రజలు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని బ్రతుకుతున్నారు. చైనాలో మొదలైన ఈ వైరస్ ఇప్పుడు భారతదేశాన్ని కూడా కదిలించి వేస్తుంది. ఈ మేరకు ఇప్పటికే పలు వాణిజ్య వ్యాపారాలు.. చైనా ఉత్పత్తులు నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే చైనాలో చాలా మంది ఈ వ్యాధి బారిన పది మృతి  చెందారు. పలువురు చికిత్స చికిత్స పొందుతున్నారు. 

 

అయితే.. ఈ నేపథ్యం లో  తెలుగు రాష్ట్రాల్లో నూ కరోనా వైరస్‌ కేసులు నమోదవడంతో అటు అధికారులు, ఇటు ప్రజలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. కరోనా నివారణకు శుభ్రతే ముఖ్యమని, ఇతరులతో కరచాలనం  చేయడం కన్నా నమస్కారం చేయడం మంచిదని చెబుతున్నారు.

 

 

కాగా, షేక్‌ హ్యాండ్‌ పై ప్రముఖ సినీ గేయ రచయిత చైతన్య ప్రసాద్‌ రాసిన పద్యాన్ని ఒకప్పుడు కీరవాణి పాడిన సంగతి తెలిసిందే. తన కుటుంబ సభ్యులందరినీ కూర్చోబెట్టి ఆయన పలికిన మాటల వీడియో మళ్లీ వైరల్‌ అవుతోంది. మాములుగా చేతితో ఎలాంటి పనులు చేస్తారో చెబుతూ చేసిన ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

 

 

వాట్సాప్‌, ట్విటర్‌, ఫేస్‌బుక్‌ల లో దాన్ని షేర్‌ చేస్తూ కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో కరచాలనం వద్దని అందరూ తమ స్నేహితులతో పంచుకుంటున్నారు. మరి చైతన్య ప్రసాద్‌ మాటలను కీరవాణి అందరికి ఆసక్తి కలిగించేలా చెప్పడంతో వీడియో వైరల్ అవుతుంది. ఈ మేరకు పలువురు సినీ ప్రముఖులు కరోనా వైరస్ పై జాగ్రత్తలు తెలియ జేస్తూ ట్వీట్లు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం కీరవాణి వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏది ఏమైనా కరోనా భారీన పడకుండా తమని తాము కాపాడుకోవాలని పలువురు సూచిస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: