కర్తవ్యం, ఒసేయ్ రాములమ్మ సినిమాలతో టాలీవుడ్ లో లేడీ సూపర్ స్టార్ అనిపించుకున్నారు గ్రేట్ ఆర్టిస్ట్ విజయశాంతి. సూపర్ స్టార్ కృష్ణ ద్వారా టాలీవుడ్ కి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు విజయశాంతి. ఆ తర్వాత నటిగా, హీరోయిన్ గా విజయశాంతి చేయని సినిమాలు లేవు. టాలీవుడ్ సీనియ హీరోలదరి తోను నటించిన విజయశాంతి ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోను లేడీ సూపర్ స్టార్ గా స్టార్ హీరోలకి ధీటుగా ఇండస్ట్రీలో నిలబడ్డారు. అలాంటి లేడీ సూపర్ స్టార్ దాదాపు 13 ఏళ్ళ లాంగ్ గ్యాప్ తరువాత చేసిన సినిమా సరిలేరు నీకెవ్వరు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఈ సినిమాతో మళ్ళీ గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చి ఆ సినిమా తరువాత వరుసగా సినిమాలు చేస్తారని అందరూ అనుకున్నారు.

 

కానీ విజయశాంతి సినిమాలు చేయడానికి అంత సుముఖంగా లేరని కొన్ని షోషల్ మీడియాలో వార్తలు రాసుకొచ్చారు. సరిలేరు నీకెవ్వరు సినిమా తరువాత కొత్త సినిమాల ప్రకటనలు కూడా రాలేదు. దాంతో ఈ వార్తలు నిజమేనని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చించుకుంటున్న మాటలు వేరేలా ఉన్నాయి. రోటీన్  పాత్రలు విజయశాంతి చేయరని, చేయడానికి ఎంత మాత్రం ఆసక్తికరంగా లేరని తాజా సమాచారం. అలాగే సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించినటువంటి పాత్రలు కూడా చేయడానికి ఇకపై ఒప్పుకోరట.

 

తనకి జీవితమాంతం గుర్తుండిపోయిన కర్తవ్యం సినిమాలో పాత్ర లాగా యాంగ్రీ వుమెన్ గా, ఫైట్లు కూడా వుండే పాత్రలు కావాలని విజయశాంతి కోరుకుంటున్నారని ఇండస్ట్రీ లో వినిపిస్తోంది. పూర్తి డైనమిజం వున్న పాత్రలు అయితేనే చేసే ఆలోచనలో విజయశాంతి వున్నారని తాజా సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. మరి అలాంటి పవర్ ఫుల్ పాత్రలు క్రియోట్ చేయాలంటే డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, లేదా బోయపాటి శ్రీను మాత్రమే చేయగలరు. మరి ఈ ఇద్దరు విజయశాంతి కోసం అలాంటి పాత్రలు క్రియోట్ చేస్తారా చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: