తమన్నా ఇండస్ట్రీకి వచ్చి పదిహేనేళ్ళు అయింది. ఈ అమ్మడి గ్లామర్ ఇప్పటికీ పదిలంగానే ఉంది. మిల్కీ బ్యూటీగా యువత గుండెను రంపంతో కోసేస్తోంది. ముప్పయి ఏళ్ళకు చేరువ అయినా ఎప్పటికీ పదహారే అంటోంది. పైగా వర్కౌట్లు చేస్తూ ఫిజిక్ ని పెర్ఫెక్ట్ గా ఉంచుకోవడంతో పాటు నటన కూడా బాగానే నేర్చేసిన ఈ భామ టాలీవుడ్లో మంచి చాయిస్ గా ఉంది.

 

అయితే వెటరన్ హీరోలకు తమన్నా అంటే ఒకరమైన తమకంగా ఉందిట. ఆమెతో నటించాలని వారు ఉవ్విళ్ళూరుతున్నారుట. ఇప్పటికే వెంకటేష్, చిరంజీవితో నటించిన తమన్నా బాలయ్య, నాగార్జునలకు మాత్రం అందడంలేదు. ఇందులో బాలయ్య గత రెండు సినిమాల‌ నుంచి తమన్నా కోసం గట్టిగానే  ట్రై చేస్తున్నట్లుగా టాక్.

 

అయితే తమన్నా డేట్లు ఖాళీలేవు అని తప్పించుకుంటోంది. ఇక ఇపుడు బోయపాటి బాలయ్య మూవీ సెట్స్ మీదకు వచ్చేసినా కూడా హీరోయిన్ల సెలక్షన్ మాత్రం ఓ పట్టాన కుదిరిచావడంలేదుట. దీంతో తమన్నాను బోయపాటి లైన్లో పెట్టాలని చూస్తున్నాడుట.

 

మెయిన్ లీడ్ ఫిమేల్ రోల్ ఆమెకే ఆఫర్ చేశారని టాక్. సెకండ్ హీరోయిన్ గా అంజలిని ఇప్పటికే ఖరారు చేసి పెట్టుకున్నారు. అయితే తమన్నా ఈసారి నో చెప్పకుండా భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందని టాక్. దాంతో షాక్ తినడం చిత్ర యూనిట్ వంతుగా ఉందిట.

 

అంత పెద్ద మొత్తం ఇవ్వడానికి అది భారీ బడ్జెట్ మూవీ కాదు. ఇప్పటికే ఇరవై కోట్లు సైజు తగ్గించి మరీ మూవీ తీస్తున్నారు. మార్కెట్లో బాలయ్య మరీ డౌన్ అయిపోయాడు. బోయపాటిది సేం టూ సేం స్టోరీ. దాంతో తమన్నా అడిగినంత ఇవ్వడానికి ఆలోచిస్తున్నారుట. తమన్నా తప్పితే ఏ గ్లామర్ హీరోయిన్ కూడా దొరికే చాన్స్ ఇపుడు లేనే లేదు. దాంతో ఎక్కువో తక్కువో ఇచ్చి ఆమెనే కన్ ఫర్మ్ చేసుకోవాలని చూస్తున్నారట. చూడాలి అపుడైనా తమన్నా కరుణిస్తుందో లేదో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: