సక్సెస్ లో ఉన్నంతవరకే గ్రాఫ్ కరెక్ట్ గా ఉంటుంది. ఒక్కసారి ఆ సక్సెస్ దూరమైతే అన్నీ సమస్యలే. రేంజ్ మారిపోతుంది.. ఆఫర్లు తగ్గిపోతాయి. చిన్నచిన్న పాత్రలకు కమిట్ అవ్వాల్సి ఉంటుంది. హెబ్బా పటేల్ కూడా ఇలాగే కెరీర్ ను కంటిన్యూ చేసేందుకు ప్రాధాన్యం లేని పాత్రలు కూడా పోషిస్తోంది. 

 

కుమారి 21ఎఫ్ తో టాలీవుడ్ లో చిన్నపాటి సంచలనం సృష్టించింది హెబ్బాపటేల్. బోల్డ్ పెర్ఫామెన్స్ తో కుర్రాళ్లకు రొమాంటిక్ ఝలక్ ఇచ్చింది. ఈ క్రేజ్ తో వరుస అవకాశాలు అందుకుంది. అయితే వరుస పెట్టి వచ్చిన ఈ అవకాశాలు, హెబ్బాకు భారీ సక్సెస్ లు ఇవ్వలేకపోయాయి. దీంతో హీరోయిన్ రేంజ్ నుంచి సపోర్టింగ్ రోల్స్ కు పడిపోతోంది హెబ్బా. 

 

హెబ్బాపటేల్ కు మూడేళ్లుగా సరైన సక్సెస్ లేదు. ఏంజెల్, అందగాడు, 24 కిస్సెస్ లాంటి ఫ్లాపులు పడ్డాయి. దీంతో ఈమె కెరీర్ స్లో అయిపోయింది. ఫేడవుట్ స్టేజ్ కు చేరింది. అయితే స్టార్డమ్ సడన్ గా తగ్గిపోవడంతో, కెరీర్ ను కాపాడుకోవడానికి చిన్నచిన్న పాత్రలు పోషిస్తోంది. రామ్ రెడ్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తోంది హెబ్బా. 

 

హెబ్బాపటేల్ రీసెంట్ గా నితిన్ భీష్మ సినిమాలో చాలా చిన్న పాత్ర పోషించింది.  రెండు మూడు బోల్డ్ సీన్లకే పరిమితమైన క్యారెక్టర్ చేసింది. ఇప్పుడేమో ఐటమ్ సాంగ్ కు షిఫ్ట్ అవుతోంది. సో హెబ్బా పరిస్థితి చూస్తే.. హీరోయిన్ గా ఈమె జర్నీ క్లైమాక్స్ కు చేరినట్టే కనిపిస్తోంది.

 

మొత్తానికి హెబ్బా పటేల్ హీరోయిన్ గా రాణించేందుకు తెగ కష్టపడుతోంది. అందివచ్చిన ప్రతీ ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. నిర్మాతలను, డైరెక్టర్లను ఆకట్టుకునేందుకు దేనికైనా సిద్ధమంటోంది. అందులో భాగంగానే ఐటమ్ సాంగ్స్ కు సైతం సై అంటోంది. మరి హెబ్బా పటేల్ కెరీర్ ముందు ముందు ఎలా ఉండబోతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: