త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్ మూవీ అంటే..దీని కథ అందరినీ ఊరిస్తోంది. ఏదో ఒక సినిమా ఇన్ స్పిరేషన్ తో కథలు రాసుకునే త్రివిక్రమ్.. తారక్ కోసం కథను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడన్న ఆసక్తి నెలకొంది. చిరంజీవి నటించిన ఓ పాత సినిమా ఆధారంగా కథ రాసుకుంటున్నాడన్న న్యూస్ హల్ చల్ చేస్తోంది. 

 

అరవింద సమేత వీర రాఘవతో ఫ్యాక్షన్ నేపథ్యాన్ని ఎంచుకొని.. మెసేజ్ ఇచ్చాడు త్రివిక్రమ్. రెండో సినిమాను ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైన్ మెంట్ గా తీయాలనుకుంటున్నాడట. ఈ క్రమంలో చిరంజీవి నటించిన మంత్రి గారి వియ్యంకుడు సినిమా ఆధారంగా త్రివిక్రమ్ కథ రాసుకుంటున్నాడని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వార్తను చిత్ర వర్గాలు వ్యతిరేకించాయి. 

 

పాత కథలనే ఈ జనరేషన్ కు తగ్గట్టు మారుస్తూ.. తనదైన మేకింగ్ తో మ్యాజిక్ చేస్తాడు త్రివిక్రమ్. బాక్సాఫీస్ ను గెలుచుకునే సూత్రం పాత కథల్లోనే ఉంది. బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన అల వైకుంఠపురములో పాయింట్ ను రామారావు నటించిన ఇంటిగుట్ట సినిమా నుంచి తీసుకున్నాడు. అలాగే.. అఆ సినిమా మీనాకు రీమేక్ కాగా.. ఈ విషయాన్ని వార్తల్లో వస్తేగానీ.. రిలీవ్ చేయలేదు. 

 

త్రివిక్రమ్, ఎన్టీఆర్ మూవీకి మంత్రిగారి వియ్యంకుడు ఆధారం కాకపోయినా.. ఏదో ఒక సినిమాను ప్రేరణగా తీసుకునే ఉంటాడు దర్శకుడు. అయితే.. అది ఏ సినిమానో తెలియాలంటే టైమ్ పడుతుంది.  అరవింద సమేత వీర రాఘవ మాదిరి తారక్ కోసం.. కొత్త పాయింట్ తో వస్తాడో చూడాలి. 

 

మొత్తానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్ తో సినిమా అనగానే ఫ్యాన్స్ ఊహల్లోకి వెళ్లిపోతున్నారు. కథల విషయంలో ఆయన రూటే సెపరేటు అంటూ మాట్లాడుకుంటున్నారు.  మెగాస్టార్ నటించిన ఓ పాత సినిమా కథాంశంగా తన కొత్త సినిమాకు రూపొందిస్తున్నాడని సమాచారం అందుతోంది. మరి త్రివిక్రమ్ కథల విషయంలో ఎలా మెలుగుతాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: