జీవితంలో ప్రతీ మనిషి తప్పులు చేయడం చాలా సహజం. అలాగే నడుస్తున్న, ఏదైనా పనులు చేస్తున్న ఒంటికి దెబ్బలు తగలడం, గాయాలవడం సర్వ సాధారణం. అయితే ఇక్కడ సెలబ్రిటీస్ విషయంలో వీటిని బూతద్దం పెట్టి మరీ చూసి వాళ్ళకి తప్ప ఇంకెవరికి ఇలాంటి దెబ్బలు, గాయాలు కానట్టు మీడియాలో అలాగే సోషల్ మీడియాలో నానా హంగామా చేస్తున్నారు. ఇక కొంతమంది నెటిజెన్స్ అయితే ఏ పని పాటా లేకుండా మొబైల్ చేతిలో పట్టుకొని మాట కోసారి కామెంట్స్ పెడుతూ హైలెట్ చేస్తుంటారు. వీళ్ళు ఒక్కసారి పడితే వీళ్ళ పిచ్చ కామెంట్స్ తో పడేస్తానే ఉంటారు. రీసెంట్ గా టాలీవుడ్ రౌడి హీరో విజయ్ దేవరకొండ కాస్త స్లిప్ అయ్యి కింద పడబోయాడు. అంతే పడిపోయాడని నెటిజెన్స్ ఓ హంగామా చేస్తున్నారు.

 

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ అనన్య పాండే నటిస్తున్న లైగర్ సినిమా షూటింగ్ కు యూనిట్ సభ్యులు వెళ్తున్నారు. చిత్ర యూనిట్ అందరు సక్రమంగానే చుట్టు పక్కల ఉన్న వాళ్ళని పట్టించుకోకుండా వెళ్లారు. కాని విజయ్ దేవరకొండ మాత్రం తన అభిమానులు గట్టిగా కేకలు వేస్తూ పిలిస్తుంటే  వాళ్ళ వైపు చూస్తూ స్లిప్ అయ్యి బ్యాలన్స్ ఔట్ అయ్యి పడబోయాడు. అయితే క్షణాల్లోనే సెట్ అయి విజయ్ అక్కడ నుండి వెళ్లి పోయాడు. కాని మీడియా మాత్రం సంఘటనను వైరల్ చేస్తూనే ఉంది. ఇది అసలు ఇష్యూనా ఏమైనా ఉందా ఇందులో అంతగా హైలెట్ చేయడానికి నాన్ సెన్స్ కాకపోతే. 

 

దీన్నే వెటకారం అని అంటారు. ఇదేమైనా సెన్షేషనల్ న్యూసా .. కాదు కదా. బయట రోజుకి ఎంతమంది రక రకాల సందర్భాలలో పడుతూ లేస్తూ పరుగులు పెడుతున్నారు. ఉదయం లేచిన దగ్గర నుంచి మళ్ళీ రాత్రి పడుకునే వరకు ఎంతమందికి గాయాలవుతున్నాయో, కాళ్ళు చేతులు విరుగుతున్నాయో.. యాక్సిడెంట్ అయి ఎంత మంది ఆసుపత్రి పాలవుతున్నారో వాళ్ళలో ఎంతమంది ప్రాణాలను పోగొట్టుకుంటునారో మాత్రం ఇలాంటి పని పాటా లేని వాళ్ళకి పట్టదు. సెలబ్రిటీస్ కి సంబంధించిన ఏ చిన్న న్యూస్ అయినా ఇలా టైం వేస్ట్ చేసుకొని మరీ హైలెట్ చేసి లేని క్రేజ్ ని అంటగడుతున్నారు. దీనికంటే ఇప్పుడు అందరినీ ఒణికిస్తుంది కరోనా వైరస్ కదా ..దానితో పోలిస్తే విజయ్ కాలు జారి పడబోవడం పెద్ద న్యూసా ..!  

మరింత సమాచారం తెలుసుకోండి: