టాలీవుడ్ లెజెండ్రీ యాక్టర్ నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ తన కెరీర్లో దాదాపుగా 350కి పైగా సినిమాలలో నటించారు. కేవలం ఒకే జానర్ సినిమాలు మాత్రమే కాకుండా సాంఘికం, జానపదం, పౌరాణికం, కౌబాయ్, జేమ్స్ బాండ్ సహా దాదాపుగా అన్ని రకాల జానర్ల పాత్రలు పోషించిన కృష్ణ, తన సినిమా కెరీర్ లో అత్యధికంగా సతీమణి విజయనిర్మలతో కలిసి దాదాపుగా 45 సినిమాల్లో హీరోగా నటించారు. ఆ తర్వాత అతిలోక సుందరి శ్రీదేవితో కలిసి దాదాపుగా 40 సినిమాలో నటించిన కృష్ణ, వాటితో చాలా వరకు విజయాలు అందుకున్నారు. ఇక అప్పట్లో వారిద్దరి జోడి ఒక పెద్ద హిట్ పెయిర్ గా మంచి పేరు సంపాదించింది. 

 

ఇక వీరిద్దరి కాంబినేషన్ లో అప్పట్లో సినిమా ఏదైనా వస్తుంది అంటే ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన అంచనాలు ఉండేవట. ఇక ముఖ్యంగా అప్పటి యువత అయితే వీరిద్దరి కాంబోలో వచ్చే సాంగ్స్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూసేవారట. ఇక వీరిద్దరి కాంబోలో వచ్చిన గొప్ప సినిమాల్లో ముందడుగు, రామరాజ్యంలో భీమరాజు, షంషేర్ శంకర్, బంగారు కొడుకు, ఊరంతా సంక్రాంతి, అడవి సింహాలు, బంగారు భూమి, మకుటం లేని మహారాజు, చుట్టాలున్నారు జాగ్రత్త, కలవారి సంసారం, వయ్యారి భామలు వగలమారి భర్తలు, వజ్రాయుధం, ఖైదీ రుద్రయ్య, కృష్ణావతారం సహా మరికొన్ని సినిమాలు ఉన్నాయి. 

 

కృష్ణ తో పోల్చుకుంటే వయసులో చాలా చిన్నదైన శ్రీదేవి తనతో కలిసి ఎన్నో సినిమాల్లో నటించడం, అలాగే వాటిలో చాలా వరకు కూడా సూపర్ సక్సెస్ సాధించి అప్పట్లో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడం నిజంగా ఎప్పటికీ మరువలేనిదని ఇప్పటికీ కృష్ణ కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్తూ ఉంటారు. ఇక ఇటీవల శ్రీదేవి మరణ సమయంలో ఆమెతో కలిసి నటించిన సినిమాల విషయాన్ని గుర్తు చేసుకున్న కృష్ణ, తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్గజ నటిని కోల్పోయిందని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని బాధాతప్త హృదయంతో మాట్లాడుతూ చెప్పారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: