తెలుగు సినిమాను మకుఠం లేని మహారాజులా ఏలిన, ఏలుతున్న వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. అటు పాత తరానికి నేటి జనరేషన్ కి మధ్యలో వారధిలా చిరంజీవి నిలిచారంటే అతిశయోక్తి కాదు. చిరంజీవి తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పుల్లో ముఖ్యమైనవి డ్యాన్సులు, ఫైట్లు. ఈ రెండింటిలో ఆయన శైలి విభిన్నం. డ్యాన్సుల్లో ఆయన స్పీడుకు సరిజోడి అనిపించుకున్న హీరోయిన్ రాధ. ఎనభయ్యో దశకంలో చిరంజీవి – రాధ కలిసి వేసిన స్టెప్స్ అప్పటి యువతను ఉర్రూతలూగించాయి.

 

 

చిరంజీవి ఫ్యాన్స్ వీరి డ్యాన్సులకు ఫిదా అయిపోయేవారు. ప్రేక్షకులైతే వీరిద్దరి జోడీని ఆ సినిమాలో వీరిద్దరూ వేసే స్టెప్పులు చూసేందుకే రిపీటెడ్ గా సినిమాలను చూసేవారంటే అతిశయోక్తి కాదు. అంతలా తెలుగు ప్రేక్షకులను ఈ జోడీ ఆకట్టుకుంది. వీరిద్దరి కాంబినేషన్ లో మొత్తం 15 సినిమాలు వచ్చాయి. చిరంజీవి మెస్మరైజింగ్ డ్యాన్సులతో అదరగొట్టేస్తుంటే ఆయన సరిసమానంగా డ్యాన్సులు వేస్తూ పాటకు వీరిద్దరూ అంత అందం తీసుకొచ్చేవారు. గూండా, అడవిదొంగ, కొండవీటి రాజా, మరణమృదంగం, రాక్షసుడు, యముడికి మొగుడు, స్టేట్ రౌడీ, కొండవీటిదొంగ, కొదమసింహం.. వంటి హిట్లతో పాటు రుద్రనేత్ర, లంకేశ్వరుడు సినిమాలు వీరి కాంబోలో వచ్చాయి. వీరిద్దరి డ్యాన్సులు చూసేందుకు ప్రేక్షకులు ఎగబడేవారంటే ఆశ్చర్యం లేదు.

 

 

అడవిదొంగలో ‘ఇది ఒక నందనవనమూ’, రాక్షసుడులో ‘అచ్చా బచ్చా’, యముడికి మొగుడు సినిమాలో ‘అందం.. ఇందూళం’ పాట, కొండవీటి దొంగలో ‘శుభలేఖ రాసుకున్నా..’ పాటలు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఎవర్ గ్రీన్ హిట్స్ అని చెప్పాలి. బ్రేక్ డ్యాన్సైనా, స్లో స్టెప్స్ ఉన్నా, పాటేదైనా చిరంజీవితో స్టెప్స్ వేయాలంటే రాధ మాత్రమే అనే ముద్ర పడిపోయింది. అంతగా వీరిద్దరూ తమ డ్యాన్సులతో హిట్ కాంబినేషన్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. 1990లో వచ్చిన కొదమసింహం వీరిద్దరి కాంబోలో వచ్చిన ఆఖరు సినిమాగా నిలిచిపోయింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: