సహజంగా ఏ హీరో హీరోయిన్ అయినా రెండు మూడు సినిమాలు చేస్తే అందులో ఒకటి రెండు అయినా ఖచ్చితంగా హిట్ అవుతాయి. గతంలో బాలయ్య విజయశాంతి, చిరంజీవి విజయశాంతి, చిరంజీవి రాధిక పదుల సంఖ్యలో సినిమాలు చేసినప్పుడు చాలా సినిమాలు హిట్ అయితే ఒకటి రెండు క్లబ్ అయ్యేవి అప్పట్లో. ఆ కాంబినేషన్ లో సూపర్ హిట్ కేక క్రేజీ హీరోయిన్ సమంత గురించి చెప్పాల్సిన పని లేదు. సౌతిండియాలో స్టార్ హీరో లతో సినిమాలు చేసిన సమంత ప్రతి ఒక్కరికి బ్లాక్ బస్టర్ హిట్ ను ఇచ్చింది. అయితే టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు మాత్రం ఆమె ఎందుకో కలిసి రాలేదనే చెప్పాలి. ఎన్టీఆర్ సమంత కాంబినేషన్లో మూడు సినిమాలు ఏఒక్క‌టీ స‌రైన హిట్‌ అనిపించుకో లేదు.

 

ముందుగా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన బృందావనం సినిమా  ఓ మోస్తరుగా ఆడింది. అప్పటికే వరుస ప్లాపులతో ఉన్న ఎన్టీఆర్ నటించిన ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకుడు. పైగా ఈ సినిమాలో సమంతతో పాటు కాజల్ కూడా స్క్రీన్ షేర్ చేసుకుంది. ఆ తర్వాత భారీ అంచనాలతో వచ్చిన రెండో సినిమా `రామయ్యా వస్తావయ్యా` ఈ సినిమా స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాలో సమంత శృతి హాసన్ తో పాటు స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇక వీరి కాంబినేషన్లో మూడో సినిమా వచ్చిన `రభస` సినిమా సైతం ఘోరమైన డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమాలో సైతం సమంత ప్రణీత కలిసి నటించారు. టోటల్‌గా ఎన్టీఆర్ సమంత కాంబినేషన్లో వచ్చిన మూడు సినిమాల్లోనూ ఆమె మరో హీరోయిన్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడంతో ఎన్టీఆర్ పక్కన ఆమె సింగిల్ హీరోయిన్ గా నటించే స్కోప్ లేకుండా పోయింది.

 

 ఈ మూడు సినిమాలు సరైన కథాకథనాలతో పాటు రాంగ్ టైమింగ్ లో రావడం ఎన్టీఆర్ కు దురదృష్టం వెంటాడుతున్న‌ టైం లో రావడం కూడా మైనస్ అయింది. ఏదేమైనా సమంత ఎన్టీఆర్ తో చేసిన మూడు సినిమాల్లో రెండు సినిమాలు అట్టర్ ఫ్లాప్ కాగా ఒక బృందావనం మాత్రం యావ‌రేజ్ టాక్‌తో సరిపెట్టుకుంది. ఎందరో స్టార్ హీరోలకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఇచ్చిన సమంత ఎన్టీఆర్ విషయంలో మాత్రం బ్యాడ్ లక్ హీరోయిన్ గా మిగిలిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: