టాలీవుడ్ లో అతి తక్కువ టైమ్ లోనే హీరోయిన్ పూజా హెగ్డే తిరుగులేని పాపులారిటీ సొంతం చేసుకుంది. ఈ తరం స్టార్ హీరోలు అందరి సినిమాల్లో నటించిన ఆమె ప్రతి ఒక్కరికి సూపర్ హిట్ సినిమాలు ఇచ్చింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ పక్కన `అరవింద సమేత వీర రాఘవ` మహేష్ బాబుతో `మహర్షి` లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో నటించిన పూజ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ఏకంగా రెండు సినిమాలు చేసింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన `దువ్వాడ జగన్నాథం` సినిమా తో పాటు తాజాగా ఈ సంక్రాంతికి త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన `అల వైకుంఠపురం లో` సినిమాలో కూడా రొమాన్స్ చేసింది. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ `రంగస్థలం` సినిమాలో ఒక పాటలో నటించిం. ఇక అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథం హిట్ అయితే అల వైకుంఠ పురం లో సినిమా ఏకంగా బన్నీ కెరీర్ లోనే తిరుగు లేని బ్లాక్ బస్టర్ హిట్ సినిమాగా నిలిచింది. `బాహుబలి` రికార్డులకు పాత‌ర‌ వేస్తూ టాలీవుడ్ హిస్టరీలో సరికొత్త పేజీని లెక్కించు కుంది.

 

`డిజె` సినిమాలో బికినీ వేసుకుని బన్నీని పడేసే సీన్లు పూజ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఆ సినిమా పాట లో వీరిద్దరి కెమిస్ట్రీ అదిరిపోయింది. ఇంకా చెప్పాలంటే పూజ బన్నీ తో పోటీపడి మరీ డ్యాన్సులు వేసిందనే చెప్పాలి. ఇక 1అల వైకుంఠ పురం లో` సినిమాలో పూజా కింద పనిచేసే ఎంప్లాయి గా నటించిన బన్నీ పూజ కాలు చూస్తూ మేడం అంటే మేడం అని ఆట పట్టించే సరదా సన్నివేశాలు కూడా అదిరిపోయాయి. ఈ సినిమాలో కూడా ప్రేమ సన్నివేశాలతో పాటు పాటల్లో పూజ, బ‌న్నీ మధ్య కెమిస్ట్రీ ని దర్శకుడు త్రివిక్రమ్ ఒక రేంజ్‌లో పండించాడు. ఏదేమైనా బన్నీకి ఈ రెండు సినిమాలతో పూజ లక్కీ హీరోయిన్ అని చెప్పాలి. అలాగే బన్నీ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ అయిన `అల వైకుంఠపురం లో` పూజ నటించటం బన్నీ కెరీర్ కి ఒక టర్నింగ్ పాయింట్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: