టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా ఓ ఊపు ఊపేస్తున్న అందాల భామ పూజా హేగ్దే తెలుగు, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తుంది. బాలీవుడ్ లో అయినా సైడ్ హీరోయిన్ గా అవకాశాలు వస్తున్నాయి కాని తెలుగులో అయితే స్టార్స్ సరసన లక్కీ ఛాన్స్ పట్టేస్తుంది. ఈ ఇయర్ మొదట్లోనే అల వైకుంఠపురములో సినిమాతో సత్తా చాటిన పూజా హేగ్దే ప్రభాస్ తో జాన్ సినిమాలో నటిస్తుంది. ఆ సినిమాతో పాటుగా అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాను చేస్తుంది.

 

 మోడల్ గా ఉన్న ఈ అమ్మడికి మొదట హీరోయిన్ ఛాన్స్ ఇచ్చింది హీరో జీవ. కోలీవుడ్ లో వచ్చిన మూగామూడి సినిమాలో జీవా సరసన అమ్మడు నటించింది. అదే సినిమా తెలుగులో మాస్క్ అంటూ రిలీజ్ అయ్యింది. ఆ తర్వాత ఒక లైలా కోసం, ముకుందా సినిమాలు చేసింది. అల్లు అర్జున్ డిజే సినిమా తర్వాత పూజా ఫేట్ మారిపోయింది. అమ్మది బికినీ అందాలు ప్రేక్షకులను మంత్ర ముగ్దుల్ని చేశాయి. అందుకే ఆమెకు వరుస ఛాన్సులు వస్తున్నాయి. ఇక లేటెస్ట్ గా అమ్మడికి మళ్ళీ కోలీవుడ్ నుండి పిలువు వచ్చిందని తెలుస్తుంది.

 

కోలీవుడ్ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ హీరోగా చేయబోయే సినిమాలో పూజా హేగ్దే హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. తెలుగులో ఆమెకు బీభత్సమైన క్రేజ్ రాగా ఆ క్రేజ్ ను కొనసాగించాలని తమిళంలో కూడా సినిమాలు చేస్తుంది పూజా. తమిళ ఆడియెన్స్ ను కూడా తన అందంతో బుట్టలో వేసుకోవాలని చూస్తుంది ఈ బుట్ట బొమ్మ. కోలీవుడ్ లో పూజా హేగ్దే రీ ఎంట్రీ ఎలా ఉండబోతుంది. ఆ సినిమా హిట్టయితే పూజా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో బిజీ హీరోయిన్ గా మారే అవకాశాలు ఉన్నాయి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: