శ‌ర్వానంద్ టాలీవుడ్ యంగ్ హీరోల్లో యూత్‌లో ఫాలోయింగ్ ఉన్న హీరో. సినీ జీవితంలో వివిధ పాత్ర‌ల‌ను పోషిస్తూ..ప్ర‌తిసారి త‌న‌ను తాను మార్చుకుంటూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నారు. ఇంకా ఆయ‌న ప్ర‌య‌త్న‌మే ఆయ‌న వ‌రుస విజ‌యాల‌ను తెచ్చిపెడుతున్నాయి. `ఐద‌వ‌తారీఖు`, `వెన్నెల` సినిమాలో హీరోగా `ల‌క్ష్మీ` సినిమాలో స‌హాయ‌పాత్ర‌లు చేసిన శ‌ర్వానంద్ ఆత‌ర్వాత గ‌మ్యం, ప్ర‌స్థానం సినిమాల ద్వారా త‌న న‌ట‌స్వ‌రూపాన్ని చూపించారు. అంతేకాకుండా `ర‌న్‌రాజార‌న్‌` సినిమాతో బ్రేక్ కొట్ట‌డంతో హీరోగా మంచి గుర్తింపు  తెచ్చుకున్నారు. నేడు శ‌ర్వానంద్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఏమాత్రం సినీ బ్యాక్‌గ్రౌండ్ లేని ఆయ‌న సినిమాల్లోకి ఎలా వ‌చ్చారు. సినిమా అవ‌కాశాల కోసం ఎన్ని క‌ష్టాలు ప‌డ్డారు అన్న విష‌యాల పై ఓ లుక్కేద్దాం...

 

ప్ర‌సాద్‌రావు, వ‌సుంధ‌ర‌దేవి దంప‌తుల‌కు 1984మార్చి6న విజ‌య‌వాడ‌లో జ‌న్మించారు. అన్న‌య్య క‌ళ్యాణ్‌, అక్క రాధిక‌. తండ్రి ఓ వ్యాపార‌వేత్త‌. త‌ల్లి గృహిణి. శ‌ర్వానంద్ చ‌దువు విష‌యానికి వ‌స్తే బేగంపేట హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్లో చ‌దువుకున్నారు. చిన్న‌ప్ప‌టి నుండి చ‌దువుకుని మంచి ఉద్యోగం చేయాల‌నేదానిక‌న్నా సినిమాల పైనే మ‌క్కువ ఎక్కువ‌గా ఉండేది. అందుకే ఇంట‌ర్ పూర్త‌వ్వ‌గానే సినిమాల్లోకి వెళ్ళాల‌ని ఇంట్లో చెప్పాడు. ఇక ఈ విష‌యం పై వాళ్ళ పేరెంట్స్ క‌నీసం డిగ్రీ అయినా పూర్తి చెయ్యాల‌ని ఒక ష‌ర‌తు పెట్టారు. దీంతో అమ్మ కోరిక మేర‌కు ఓకే చెప్పి సికింద్రాబాద్‌లోని వెస్లీ కాలేజ్‌లో బీకామ్ పూర్తి చేశారు. అయితే తాను చ‌దువుకునే స‌మ‌యంలో రానాద‌గ్గుపాటి, రాంచ‌ర‌ణ్‌తేజ్ క్లాస్‌మేట్స్‌గా ఉండేవారు. చాలా ఏళ్ళు క‌లిసి చ‌దువుకున్నారు. వీరి మ‌ధ్య ఎప్పుడూ సినిమాల ప్ర‌స్థావ‌న అయితే మాత్రం వ‌చ్చేది కాద‌ట‌. ఎందుకంటే అప్ప‌ట్లో ఎవ‌రికి దాని మీద పెద్ద అవ‌గాహ‌న లేదు. అయితే చిన్న‌ప్ప‌టి నుంచి కూడా చ‌దువు మీద ఇంట్ర‌స్ట్ చాలా త‌క్కువ‌. ఎప్పుడూ ఏద‌న్నా ఒక క‌ళారంగం పైనే ఆశ‌క్తి ఉండేద‌ట‌. ఏ బ్యాక్ గ్రౌండ్ లేక‌పోయినా సినిమాల్లోకి రావ‌ల‌నే ఆశ‌క్తితో మెగాస్టార్ చిరంజీవి లాగా అవ‌కాశాల కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు.

 

స్కూల్లో డ్రామా, డాన్స్ పోటీల జాబితాల్లో అత‌ని పేరు ముందుండేది. ప‌క్క‌నే ఉన్న ఆనంద్ థియేట‌ర్లో చాలా సినిమాలు చూసేవాడ‌ని చెప్పాడని ఓ సంద‌ర్భంలో తెలిపారు.ప్ర‌స్తుతానికి ఎప్ప‌టిక‌ప్పుడు ముఖ క‌వ‌ళిక‌లు మార్చుకుంటూ త‌న‌దైన శైలితో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నారు. డిగ్రీ పూర్త‌య్యాక బ్యాడ‌మ్మెంటన్ చేస్తుండ‌గా ఆర్య‌న్‌రాజేష్ ప‌రిచ‌య‌మ‌య్యాడు. దీంతో త‌న‌ను ప‌రిచ‌యం చేసుకుని హీరో అవ్వాల‌నుకుంటున్న విష‌యం తెలిపాడు. దీంతో ఆర్య‌న్ యాక్టింగ్ క్లాసెస్ గురించి తెలిపాడు. ముంబైలో ఆరు నెల‌లు శిక్ష‌ణ పొందారు. ఆ త‌ర్వాత హైద‌రాబాద్‌లో అవ‌కాశాల కోసం తిర‌గ‌డం మొద‌లుపెట్టాడు. ప‌రిశ్ర‌మ‌లో ప‌రిచ‌యాలు లేక‌పోవ‌డంతో సొంతంగా ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: