బాలకృష్ణ నయనతార... సింహ సినిమాతో ఈ పెయిర్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. ప్రధానంగా ఆ సినిమాలో భార్యా భర్తలు గా ఈ ఇద్దరి నటన ఎంతో ఆకట్టుకుంది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడానికి వీరి నటన కూడా ప్రధాన కారణంగా చెప్తూ ఉంటారు. ముఖ్యంగా బోయపాటి శ్రీను నయనతారను చూపించిన విధానం ఎంతో ఆకట్టుకుంది. వీరిద్దరి మధ్య పాటలు కూడా ఒక రేంజ్ లో ఆకట్టుకున్నాయి ప్రేక్షకులను. ఈ తరంలో బాలకృష్ణ పక్కన మరో హీరోయిన్ సరిపడే అవకాశం లేదని పలువురు కామెంట్స్ కూడా చేసారు. 

 

ఆ తర్వాత ఈ జోడీ మళ్ళీ జై సింహా అనే సినిమాలో నటించారు. ఈ సినిమా కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చి సూపర్ హిట్ అయింది. త్వరలో వచ్చే బోయపాటి శ్రీను దర్శకత్వంలో కూడా బాలయ్య పక్కన ఈమెను తీసుకోవాలని భావించారు. అయితే అనూహ్యంగా నయనతార భారీగా డిమాండ్ చేసిన నేపధ్యంలో చిత్ర యూనిట్ వెనక్కు తగ్గింది. ఈ మధ్య కాలంలో బాలకృష్ణ పక్కన చాలా మంది హీరోయిన్లు నటించినా సరే వీరి కాంబినేషన్ రేంజ్ లో ఎవరూ లేరు. సోనాల్ చౌహాన్ కూడా బాలకృష్ణ పక్కన పర్వాలేదనిపించినా... 

 

బాలయ్య ఇమేజ్ కి నయనతార అయితేనే బాగుంటుంది అంటూ పలువురు కామెంట్ చేసారు. బాలకృష్ణ కెరీర్ లో హిట్ పెయిర్ గా అప్పట్లో విజయశాంతి, రోజా ఉండే వారు. ఈ మధ్య కాలంలో మాత్రం నయనతార అయ్యారు. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే వేసవిలో ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ కూడా మొదలుపెట్టింది చిత్ర యూనిట్. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరూ అనేది స్పష్టత రావడం లేదు. నయనతార మాత్రం తమిళ సినిమాల్లో బిజీ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: