టాలీవుడ్ లో ఎన్నో జంటలు ఉన్నప్పటికీ చాలా తక్కువ జంటలు ఫ్యామిలీ ఆడియన్స్ మనసులు దోచే సాయి. ఇలా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎక్కువగా అలరించి మనసులు దోచేసిన జంటల్లో ముందుగా గుర్తొచ్చేది జగపతి బాబు కళ్యాణి. అప్పట్లో జగపతి బాబు కళ్యాణి జంట.. టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోయింది. ఇద్దరు ఏ సినిమాలో నటించిన ప్రేక్షకులు ఆదరించారు. దీంతో ఫ్యామిలీ ఆడియన్స్ లో ఈ జంటకు  ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పడింది. అటు జగపతి బాబు కు మంచి స్టార్ డమ్  తెచ్చి పెట్టడమే కాదు కల్యాణికి కూడా మంచి గుర్తింపు వచ్చింది. వీరిద్దరు సినిమాల తర్వాత వరుస అవకాశాలు కూడా అందుకున్నారు. 

 

 

 ముఖ్యంగా జగపతిబాబు హీరోగా కళ్యాణి  హీరోయిన్ గా వచ్చిన చిత్రం పెద్ద బాబు... ఈ సినిమాలో కొంటెపిల్లగా  కళ్యాణి నటిస్తే... సీరియస్ ఉండే పాత్రలో జగపతిబాబు నటిస్తున్నారు. వీరిద్దరి మధ్య జరిగే చిలిపి పనులు.. ఎలాంటి వల్గారిటీ లేని రొమాన్స్ లు... సరసాలు అన్ని ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఈ సినిమా సంచలన విజయం సాధించింది. దీంతో ఈ జోడికి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పెరిగిపోయింది. ఆ తర్వాత జగపతి బాబు కళ్యాణి జంటగా కబడి కబడి సినిమాలో  నటించారు. ఈ సినిమాలో  ఆవారాగా తిరిగే అబ్బాయి గా జగపతిబాబు... విలేజ్ ప్రెసిడెంట్ చెల్లెలుగా కళ్యాణి నటిస్తారు. 

 

 

 ఈ క్రమంలోనే కళ్యాణ్ పై మనసు పారేసుకున్న జగపతిబాబు ఆమె కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడతాడు. ఇక కబడ్డీలో గెలిస్తేనే నా చెల్లెలిని ఇచ్చి పెళ్లి చేస్తాను అంటూ కళ్యాణి అన్నయ్య చెప్పడంతో కబడ్డీలో గెలవవడానికి జగపతిబాబు నానా పాట్లు పడతాడు. ఇలా సినిమా మొత్తం ఎంతో ఆసక్తికరంగా సాగుతుంది. క్లైమాక్స్ లో ఓడిపోతున్న జట్టును కూడా గెలిపించడానికి... జగపతిబాబు కష్టపడుతున్న తీరు... అంతకుముందు కళ్యాణి జగపతిబాబు మధ్య నడిచే లవ్ ట్రాక్... ఇలా అన్ని ఫ్యామిలీ ఆడియన్స్ ను తెగ ఆకట్టుకున్నాయి. దీంతో ఈ జంట ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా ఫేవరేట్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: