టాలీవుడ్ లోకి సమంతా అడుగుపెట్టి పదేళ్ళు అయింది. ఈ పదేళ్ళలో ఆమె ఎందరో స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. తనకంటూ ఒక ప్రత్యేక ఫ్యాన్ బేస్ సంపాదించుకుని ముందుకి వెళ్తుంది. దాదాపు అందరు స్టార్ హీరోలతో ఆమె సినిమాలు చేసింది. మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇలా అందరితో ఆమె నటించింది. ఇక ఆమె కొందరు హీరోలతో మాత్రం ఎక్కువ సినిమాల్లో నటించింది. అందులో జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. వీరి కాంబినేషన్ లో నాలుగు సినిమాలు రాగా రెండు సినిమాలు హిట్ రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. 

 

వీరి కాంబినేషన్ లో వచ్చిన తొలి సినిమా బృందావనం సూపర్ హిట్ అయింది. ఆ సినిమాలో వీరి జోడీ కి మంచి మార్కులే పడ్డాయి. అలా హిట్ ట్రాక్ లోకి వెళ్ళిన ఈ ఇద్దరు ఆ తర్వాత రామయ్య వస్తావయ్యా అనే సినిమాలో నటించారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ అయినా ఈ జోడి మాత్రం హిట్ అయింది. ఆ మరుసటి ఏడాది అనే 2014 లో రభస అనే సినిమాలో నటించారు. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయింది. దీనితో సమంతా ఎన్టీఆర్ కాంబినేషన్ వద్దని అనుకున్నారు. 

 

అయితే 2016 లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా సూపర్ హిట్ అయింది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో వీరు బావా మరదళ్ళు గా కలిసి నటించారు. ఆ సినిమా మంచి హిట్ అవ్వడంతో ఈ జోడి మళ్ళీ ఫాం లోకి వచ్చింది. ఎన్టీఆర్ పక్కన చేసిన సినిమాలతోనే సమంతా కు స్టార్ హీరోయిన్ హోదా వచ్చిందని అంటూ ఉంటారు. ఇక ఇప్పుడు ఈ జోడి మరోసారి త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చే సినిమాలో కలిసి నటిస్తుంది అంటున్నారు. అది ఎంత వరకు నిజం అనేది తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: