కాజల్ అగర్వాల్. అందగత్తె. కాదు అని ఎవ‌రూ అనలేరు. అంత ధైర్యం ఎవరికి ఉంది. ఎందుకంటే ఆమె అందాల చందమామలా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె  ఆ మీదట యువరాణిగా మగధీరుడి ప్రేమను గెలుచుకుంది. తన అందంతో ప్రతీ సినిమాలో కొత్త అందాన్ని తెచ్చిన కాజల్ అంటే కుర్రకారు వెర్రెక్కిపోయిన మాట కూడా వాస్తవం.

 

అయితే ఇదంతా ఇపుడు గతం అంటున్నారు. కాజల్ వయసు మూడున్నర పదులు దాటేసింది. ఆమె ఇంకా పెళ్ళి చేసుకోలేదు కానీ పెద్దమ్మ అయిపోయింది. ఆమె చెల్లెలు నిషా అగర్వాల్ కి కొడుకు పుట్టి పెద్దమ్మా అంటున్నాడంటే ఆంటీగా కాజల్ అవతారం ఎత్తేసిందనుకోవాలి.

 

ఇక నేనే రాజు, నేనే  మంత్రి మూవీ హిట్ తరువాత తెలుగులో కాజల్ కి సినిమాలకు  హిట్లు లేవు. ఇక ఇపుడు ఆమె కెరీర్ పూర్తిగా డౌన్ ఫాల్ లో ఉంది. ఆమె సినిమాలకు ప్యాకప్ చెప్పి పెళ్ళి చేసుకోవడం బెటర్ అని కూడా అంటున్నారు. అయితే కాజల్ మాత్రం ఇంకా తన సత్తా చూపిస్తామని అంటోంది.

 

అయితే కాజల్ కి చాన్సులు ఇచ్చే వారే కనిపించడంలేదు. లేటెస్ట్ గా తేజా తన కొత్త మూవీలో మొదట కాజల్ అనుకుని ఆ తరువాత కీర్తి సురేష్ ని సెలెక్ట్ చేశారని అంటున్నారు. మరో వైపు కాజల్ లో కొత్త దిగులు పుడుతోదంట. తన గ్లామర్ బాగా తగ్గిపోయిందని ఈ అమ్మడు తెగ బాధపడిపోతోందట.

 

అవుని మరి వయసు ఊరుకుంటుందా. ఒక్కో ఏడూ ముందుకు వెళ్తూంటే ఎంతటి అందగత్తెలైనా కూడా అలా అవాల్సిందేకదా. ఇదిలా ఉంటే కాజల్ కి ఇంకా డిమాండ్ ఒక్క చోట కనిపిస్తోందిట. అదే వెటరన్ హీరోలు. ఆరు పదుల వయసు దాటిన టాలీవుడ్ టాప్ ఫోర్ నుంచి అవకాశాలు వస్తున్నాయట. ఇప్పటికే చిరంజీవితో చేసిన కాజల్ కి తాజాగా బాలయ్య బోయపాటి మూవీ నుంచి కూడా పిలుపు వచ్చిందట.

 

బాలయ్య పక్కన చేస్తే ఇక కాజల్ సీనియర్లకు పెయిర్ గా కంప్లీట్ గా ముద్ర పడిపోతుందని భయపడుతోందట. మొత్తానికి కాజల్ ది ఓ వైపు అందం బాధ, మరో వైపు అవకాశాలు లేవని బాధగా  ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: