అల వైకుంఠపురములో’ మూవీ ఇండస్ట్రీ హిట్ కావడానికి ఆ మూవీ పాటలు కూడ ఎంతగానో సహకరించాయి. ముఖ్యంగా ‘బుట్టబొమ్మ’ పాట ట్యూన్ విపరీతంగా నచ్చడంతో కేవలం ఈ పాట కోసమే అనేకసార్లు ఈ మూవీని చూసిన వాళ్ళు ఉన్నారు. 


అయితే ఇప్పుడు అదే బుట్టబొమ్మ మ్యాజిక్ పవన్ లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’ లో రిపీట్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘అల వైకుంఠపురములో’ మూవీ కోసం బుట్టబొమ్మ పాట వ్రాసిన రామజోగయ్య శాస్త్రి తో ఒక పాటను పవన్ కోసం రాయించడమే కాకుండా ఏకంగా ఈ పాట వ్రాసే విషయంలో త్రివిక్రమ్ సలహాలను కూడ రామజోగయ్య శాస్త్రికి ఇచ్చే విధంగా దిల్ రాజ్ ఇప్పటికే వ్యూహాలు రచించినట్లు టాక్. 


ఇది ఇలా ఉండగా ‘వకీల్ సాబ్’ మూవీకి సంబంధించి ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో క్లైమాక్స్ సీన్ చిత్రీకరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.  ఈ క్లైమాక్స్ లో వచ్చే కోర్టు సీన్ లో దాదాపు ఒకటిన్నర నిముషానికి పైగా ఉండే చాల పెద్ద డైలాగును పవన్ సింగిల్ టేక్ లో ఆవేసపూరితంగా చెప్పి ఆ మూవీ యూనిట్ వర్గాలను ఆశ్చర్య పరిచినట్లు వార్తలు వస్తున్నాయి. 

 

పవన్ కళ్యాణ్ ఈ డైలాగ్ చెపుతున్నప్పుడు అతడు చూపించిన టైమింగ్ కి యాక్టింగ్ సింక్ కు సూపర్ అంటూ ఈ డైలాగ్ పూర్తి అయిన వెంటనే యూనిట్ సభ్యులు అంతా చప్పట్లు కొట్టి అభినందనలు తెలిపినట్లు తెలుస్తోంది. ఇది ఇలా కొనసాగుతూ ఉంటే ఈ మూవీకి దిల్ రాజ్ ఆశిస్తున్న స్థాయిలో బయ్యర్ల దగ్గర నుండి అనుకున్న రేట్స్ రాక వడంతో ఈ మూవీని తక్కువ రేట్లకు ఇచ్చే బదులు తనే ఈ మూవీ రైట్స్ ఉంచుకుంటాను అంటూ దిల్ రాజ్ ప్రదర్శిస్తున్న మితిమీరిన ఆత్మ విశ్వాసం ప్రస్తుతం ఇండస్ట్రీ హాట్ న్యూస్ గా మారింది. ఈ ఏడాది సమ్మర్ సీజన్ కు ఒక్క పవన్ సినిమా తప్ప మరే టాప్ హీరో సినిమా లేకపోవడంతో దిల్ రాజ్ ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: