ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యాభై దేశాలకి పాకి ప్రజలందరినీ గడగడ వణికిస్తున్న కరోనా వైరస్ గురించి అందరికీ తెలిసిందే. ఇంకా వ్యాక్సిన్ కనుగొనబడని ఈ వైరస్ గురించి ప్రతీ ఒక్కరిలో ఆందోళన ఉన్నమాట నిజమే. చైనా నుండి వచ్చిన ఈ వైరస్ హైదారాబాద్ ని కూడా తాకి ఇక్కడి ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేస్తుంది. ఏ క్షణం ఏం జరుగుతుందోనని భయంతో ప్రజలందరూ క్షణం క్షణం భయపడుతూనే ఉన్నారు.

 

అసలే కరోనా గురించి మీడియాలో వస్తున్న వార్తలకి భయపడుతున్న టైమ్ లో ఈ కరోనాని వాడుకునే వాళ్ళు చాలా ఎక్కువైపోయారు. మందు కనుగొనబడని ఈ వైరస్ కి తమ దగ్గర మందు ఉందంటూ..ఇలా చేస్తే కరోనా మీ దరిచేరదు అంటూ అడ్వర్టైజింగ్ లతో ఊదరగొట్టేస్తున్నారు. అయితే ప్రజలు అది నిజమా కాదా అన్న విషయం పక్కన పెట్టి కరోనా మనవరకు రాకుండా ఉంటే చాలన్న ఉద్దేశ్యంతో ఎవ్వరేం చెప్పినా పాటించడానికి సిద్ధంగా ఉన్నారు.

 

ఈ విధంగా కరోనాని వాడుకుంటున్న వాళ్లలో సినిమా దర్శకుడు రవిబాబు కూడా చేరిపోయారు. గత కొన్ని రోజులుగా దర్శకుడిగా విజయం కోసం ట్రై చేస్తున్న రవిబాబు "క్రష్" అనే సినిమా చేస్తున్నాడు. సినిమా ప్రమోషన్ల విషయంలో విభిన్నతని పాటించే రవిబాబు ఈ సారి క్రష్ సినిమా కోసం కరోనాని వాడుకున్నాడు. క్రష్ సినిమా పోస్టర్ ని చూస్తే ఈ విషయం క్లియర్ గా అర్థం అవుతుంది.

 

హీరోహీరోయిన్లు ఇద్దరు మాస్క్ వేసుకుని లిప్ లాక్ చేసుకే పోస్టర్ ని వదిలి అందరికీ ఆసక్తి కలిగేలా చేశాడు. కానీ కరోనాని ఈ విధంగా వాడుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనే విషయం చర్చ జరుగుతుంది. ఒకవైపు కరోనా గురించి భయపడుతుంటే, మరోవైపు ఈ విధమైన ప్రమోషన్లు జనాల్లో మరింత భయాలని పెంచుతాయని అంటున్నారు. ఇలాంటి పబ్లిసిటీతో జనాలకి దగ్గర కావాలనుకోవడం కరెక్ట్ కాదని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: