బాలీవుడ్ లో గత కొంత కాలంగా వరుసగా స్టార్ హీరోల వారసులు మాత్రమే కాదు వారసురాళ్లు కూడా హీరోయిన్లుగా వస్తున్నారు. అయితే స్టార్స్ కూతుళ్లు ఇండస్ట్రీలోకి రావడానికి ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తుంటారు. కానీ ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. మహిళలకు స్వేచ్చా హక్కులు అన్నింటా సమానం అంటూ ఇండస్ట్రీలో కూడా తమ టాలెంట్ చూపించుకునే అవకాశాన్ని దక్కించుకుంటున్నారు స్టార్ కిడ్స్. ఇప్పటికే కరిష్మాకపూర్, కరీనా కపూర్, సోనమ్ కపూర్, సోనాక్షి సిన్హా తర్వాత ఈ మద్య శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్, సారీ అలీఖాన్, శ్రద్దా కపూర్ ఇలా వరుస పెట్టి హీరోయిన్లు తమ జోరు కొనసాగిస్తున్నారు.
అయితే కేవలం హీరోయిన్లుగానే కాదు మోడలింగ్ లో కూడా బాలీవుడ్ బ్యూటీలు తమ సత్తా చాటుకుంటున్నారు. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు అంటే ఇండస్ట్రీలో ఎంతటి స్టార్ కిడ్ అయినా గ్లామర్ తో తమ హోయలు చూపించాల్సిందే. ఇందులో ముందు ఉంటుంది.. సారీ అలీఖాన్. ఈ బ్యూటీ వెండితెరపై కన్నా సోషల్ మీడియాలో ఎక్కువగా తన బికిని ఫోటోలతో సందడి చేస్తుంది. సారా అలీఖాన్ కేథరినాథ్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయినా.. పెద్ద హిట్ మాత్రం దక్కలేదు.
ఆ తర్వాత తెలుగు లో హిట్ అయిన టెంపర్ రీ మేక్ బాలీవుడ్ లో రణ్ వీర్ సింగ్ నటించిన ‘సింబ’లో నటించింది. ఈ మూవీలో హీరోగా రణ్ వీర్ సింగ్ కే బాగా పేరు వచ్చింది. రెండు చిత్రాలతో మెప్పించిన సారా మూడో చిత్రం లవ్ ఆజ్ కల్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. గ్లామర్ షో కు ఏ మాత్రం వెనకడుగు వేయబోను అని అని చెప్పేందుకు ఈ మద్య తన ఇన్ స్ట్రాగామ్ లో పోస్ట్ చేస్తున్న బికినీ ఫోటోలే నిదర్శనం అని చెప్పొచ్చు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.