మెగా వారసుడిగా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరో అల్లు అర్జున్‌. గంగోత్రి సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన బన్నీ ఇన్నేళ్ల కెరీర్‌ ఒక్కో సినిమాకు ఒక్కో హీరోయిన్‌ తో నటించాడు. ఒక్క భామ తప్ప మరే హీరోయిన్‌ ను రిపీట్ చేయలేదు. హరీష్ శంకర్‌ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమా డీజే దువ్వాడ జగన్నాథమ్‌. ఈ సినిమాలో అల్లు అర్జున్‌ కు జోడిగా పూజా హెగ్డే నటించింది. ఈ సినిమాలో వీరి జంట సూపర్బ్‌ అనిపించింది.

 

అయితే అప్పటి వరకు ఏ హీరోయిన్‌ ను రిపీట్ చేయని బన్నీ, పూజాతో మాత్రం మరో సినిమా చేశాడు. ఇటీవల త్రివిక్రమ్‌ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అల వైకుంఠపురములో సినిమాతో ఇండస్ట్రీ హిట్ సాధించాడు అల్లు అర్జున్‌. గీతా ఆర్ట్స్‌, హారికా హాసిని క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో కూడా బన్నీకి జోడిగా పూజా హెగ్డేనే నటించింది. ఈ రెండు సినిమాలు సూపర్‌ హిట్ కావటంతో పూజా, బన్నీకి లక్కీ గర్ల్‌ అని భావిస్తున్నారు. అందుకే అల వైకుంఠపురము లో ప్రమోషన్‌ సందర్భంగా బన్నీ పూజాతో మరో సినిమా చేస్తానంటూ ప్రకటించాడు అల్లు అర్జున్‌.
IHG

 

అయితే గతంలో మరో భామను కూడా రిపీట్ చేశాడు బన్నీ అయితే హీరోయిన్‌ గా మాత్రం కాదు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇద్దరమ్మాయిలతో సినిమాలో అమలా పాల్‌ తో పాటు కేథరిన్‌ థెస్సా మరో హీరోయిన్‌ గా నటించింది. ఈ సినిమా తరువాత కేథరిన్‌ మరోసారి సరైనోడు సినిమాలో బన్నీతో జత కట్టింది. అయితే ఈ రెండు సినిమాల్లో కేథరిన్‌ సెకండ్‌ హీరోయిన్‌ గానే కనిపించింది. దీంతో హీరోయిన్‌ లిస్ట్‌ లో బన్నీ రిపీట్ చేసిన ఒకే ఒక్క హీరోయిన్‌ పూజా హెగ్డే రికార్డ్‌ సృష్టించింది.
IHG

మరింత సమాచారం తెలుసుకోండి: