ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టిన బాలీవుడ్‌ సీనియర్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌ గురువారం తన బెస్ట్ ఫ్రెండ్స్‌తో కలిసి బాంద్రాలో సందడి చేసింది. మలైకా అరోరా, అమృతా అరోరాలతో కలిసి బాంద్రాలో హాట్‌ లుక్స్‌లో అదరగొట్టింది. అమ్మలు అయిన తరువాత కూడ అదిరిపోయే ఎక్స్‌పోజింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు ఈ హాట్ బ్యూటీస్.

 

గుడ్‌ న్యూస్‌ నటీమణి కరీనా కపూర్‌ తన ఫ్యాషన్‌ ఛాయిస్‌తో ఎప్పటికప్పుడు అభిమానులకు షాక్‌ ఇస్తూనే ఉంటుంది. కేవలం డిఫరెంట్ డిజైన్స్‌తోనే కాదు ఎవరూ ఊహించలేనంత కాస్ట్‌లీ ఎక్ససరీస్‌లు వినియోగిస్తూ అందరిని అవాక్కయ్యేలా చేయటం కరీనా స్టైల్‌. ముఖ్యంగా హ్యాండ్‌ బ్యాగ్స్‌, డ్రెస్‌ల విషయంలో కరీనా చాయిస్‌కు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. గురువారం ప్రైవేట్‌ పార్టీకి వచ్చిన కరీనా 13 లక్షల ఖరీదు చేసే హ్యాండ్ బ్యాగ్‌ను 27 వేల రూపాయల పాంట్‌ను ధరించి వచ్చింది.

 

ఎద అందాలు కనిపించేలా కరీనా వేసుకున్న బ్లాక్‌ టాప్‌ సూపర్బ్‌ అనిపించేలా ఉంది. ఇక సినిమాల విషయానికి వస్తే ఇప్పటికే అంగ్రేజీ మీడియం సినిమా రిలీజ్‌ కోసం ఎదురుచూస్తోంది. ఇర్ఫాన్‌ ఖాన్‌, రాధికా మదన్‌ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా మార్చి 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆమిర్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కుతున్న లాల్‌ సింగ్‌ చద్దా సినిమా షూటింగ్‌లోనూ బిజీగా ఉంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

The cat's out of the bag. #HelloInstagram

A post shared by kareena kapoor Khan (@kareenakapoorkhan) on

మరింత సమాచారం తెలుసుకోండి: