బన్నీ ఈ ఏడాది రెండు సినిమాలతో వస్తాడా.. లేదా.. ఈ ఒక్కటి హీరో చేతుల్లో లేదు. దర్శకుడు సుకుమార్ దయ తలిస్తే.. ఈ ఏడాది వస్తుంది. లేదంటే.. కష్టమే. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కే ఈ మూవీ ఎప్పుడు వస్తుందో తెలుసా.. 

 

2020 బన్నీకి కలిసొచ్చింది. సంక్రాంతి అల వైకుంఠపురములోతో నాన్ బాహుబలి రికార్డ్స్ తిరగరాశాడు. అల రిలీజ్ కాకుండానే.. సుకుమార్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ కాంబినేషన్ ఇప్పటికే మొదలు కావాల్సి ఉంది. నెలాఖరులో బన్నీ జాయిన్ అవుతాడని తెలిసింది. సినిమా మేకింగ్ కు ఎక్కువ టైమ్ తీసుకునే సుకుమార్.. ఏడు ఎనిమిది నెలలు సెట్స్ పై ఉండి.. రిలీజ్ కోసం సంక్రాంతిని టార్గెట్ చేశాడు. అయితే.. ట్రిపుల్ ఆర్ రాకతో బన్నీ, సుకుమార్ మూవీకి అనుకోకుండా ఎదురుదెబ్బ తగిలింది. 

 

2021సంక్రాంతి మిస్ కావడంతో.. బన్నీ సుకుమార్ సినిమా రిలీజ్ డైలమాలో పడింది. సంక్రాంతి  బదులు 2021 సమ్మర్ కు వద్దామనుకునే అవకాశం లేదు. షూటింగ్ పూర్తయిన తర్వాత కూడా చాలా నెలలు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సినిమాను సుకుమార్ త్వరగా పూర్తి చేస్తే.. దసరాకు వచ్చే ఉద్దేశంతో చిత్ర యూనిట్ ఉంది. 

 

సుకుమార్ ను నమ్మడానికి వీల్లేదు. అనుకున్న టైమ్ లో షూటింగ్ పూర్తి చేస్తాడన్న గ్యారెంటీ లేదు. షూటింగ్ ఆలస్యమై.. దసరాకు రాలేకపోతే.. క్రిస్మస్ కు వద్దామన్న ప్లాన్ బి కూడా నిర్మాతల దగ్గర ఉందట. ఏదైమైనా.. బన్నీ ఎప్పుడు వచ్చేది.. సుకుమార్ చేతుల్లో ఉందన్న మాట. స్పీడ్ గా ఐదు నెలల్లో షూటింగ్ చేస్తే.. దసరాకు.. లేదంటే క్రిస్మస్ కు సినిమా వస్తుంది. మొత్తానికి సుకుమార్ డైలమాలో పడిపోయాడు. ఎప్పుడు తన సినిమా రిలీజ్ చేస్తే ఏమౌతుందో అనే సందిగ్ధతలో ఉండిపోయాడు. చూద్దాం.. ఏంచేస్తాడో..

మరింత సమాచారం తెలుసుకోండి: