టాలీవుడ్ లో అడుగుపెట్టిన చాలా రోజులకు మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోల్లో శర్వానంద్ ఒకడు. ఏ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా సరే తనకు ఉన్న ప్రతిభతో శర్వానంద్ కెరీర్ లో నిలబడే ప్రయత్నం చేసాడు. మంచి సినిమాలు చేస్తూ వచ్చాడు. కథకు ప్రాధాన్యత ఇస్తూ నటనతో ఆకట్టుకోవడానికి శర్వా రెడీ అయ్యాడు. చాలా సినిమాల్లో తన మంచి నటన తో ఎందరో అభిమానులను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా యాక్టివ్ గా నటించడమే కాకుండా కథలో కాస్త వైవిధ్యాన్ని ఎక్కువగా కోరుకునే వాడు. దీనితో టాలీవుడ్ లో తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు వచ్చిన నటుడు అతను. 

 

ఇప్పుడు కెరీర్ కాస్త ఇబ్బంది పడుతుంది. అవును కొన్ని కొన్ని చిన్న తప్పులతో అతను వరుస ఫ్లాపులు ఎదుర్కొంటున్నాడు. టాలీవుడ్ లో ఉన్న యువ హీరోల్లో అతనికి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఇక అమ్మాయిల్లో కూడా మంచి ఫాలోయింగ్. అతని నటన విమర్శకుల ప్రసంశాలను కూడా అందుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో అతని నుంచి ఒక్క మంచి సినిమా కూడా రాలేదు అనే మాట నిజం. దీనితో అతని కెరీర్ ఏంటీ అనే ప్రశ్నలు ఎక్కువగా వినపడుతున్నాయి. 

 

కథల ఎంపిక విషయంలో శర్వానంద్ కాస్త జాగ్రత్త పడితే చాలు అతని కెరీర్ కి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అతనికి సినిమాలు ఫ్లాప్ అయినా సరే వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని టాలీవుడ్ జనాలు అంటున్నారు. కాబట్టి శర్వా జాగ్రత్త పడితే మాత్రం మంచి హీరో అవుతాడని, గమ్యం, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజులాంటి సినిమాలు, రన్ రాజా రన్ లాంటి సినిమాలు ఇంకా ఇంకా తీయవచ్చని అంటున్నారు. ఎక్కడా కూడా కంగారు పడాల్సిన పని లేదని అంటున్నారు. ఇటీవల అతను నటించిన జాను సినిమా ఫ్లాప్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: